YS Jagan Fired on AP Govt : హామీల అమ‌లులో ఏపీ కూట‌మి వైఫ‌ల్యం

నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్

Hello Telugu - YS Jagan Fired on AP Govt

Hello Telugu - YS Jagan Fired on AP Govt

YS Jagan : అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan) రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ, ప్ర‌పంచంలోని తెలుగు వారంద‌రికీ దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా కూట‌మి స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఏ ఒక్క హామీని పూర్తిగా అమ‌లు చేసిన పాపాన పోలేద‌న్నారు. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అని ప్ర‌శ్నించారు. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున ఇస్తామ‌న్న భృతి ఏమైంద‌ని అన్నారు జ‌గ‌న్ రెడ్డి. ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000 ఎక్క‌డ ఇస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామ‌న్నార‌ని, నెల నెలా రూ.4వేలు ఎక్క‌డ జ‌మ చేశారో చెప్పాల‌న్నారు.

YS Jagan Slams NDA Govt

ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్‌ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట ఎక్క‌డ నిల‌బెట్టు కున్నారంటూ నిల‌దీశారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000 ఇస్తామ‌న్నారని, ఇప్పుడు దాని ఊసెత్త‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు మాజీ సీఎం. ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు ఇస్తామ్నార‌ని అవి ఎక్క‌డ ఉన్నాయో చెప్పాల‌న్నారు. ఒక్క బ‌స్సు ప్ర‌యాణం త‌ప్పా చేసింది ఏముంద‌న్నారు. మీరు రాక ముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడం కాదా అని ప్ర‌శ్నించారు.

Also Read : Harish Rao Shocking Comments : సీతక్క కామెంట్స్ హరీష్ రావు కౌంటర్

Exit mobile version