Harish Rao Shocking Comments : సీతక్క కామెంట్స్ హరీష్ రావు కౌంటర్

ముందు ఆ గ‌న్ ఎవ‌రిదో తేల్చాల‌ని డిమాండ్

Hello Telugu - Harish Rao Shocking Comments

Hello Telugu - Harish Rao Shocking Comments

Harish Rao : హైద‌రాబాద్ : వాస్త‌వాలు ఏమిటో తెలుసు కోకుండా మంత్రి సీత‌క్క మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao). సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచ‌రుడు రోహిన్ రెడ్డి గ‌న్ తో బెదిరించాడ‌ని, ఆ విష‌యాన్ని తాను చెప్ప‌లేద‌ని ప్ర‌త్య‌క్షంగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా ప‌టేల్ చెప్పింద‌న్నారు. ఆమె చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా వైర‌ల్ గా మారాయ‌ని , దీనిపై ఇప్పటి దాకా సీఎం రేవంత్ రెడ్డి నోరు మెద‌ప లేద‌న్నారు. మంత్రుల మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య పోరుతో పాటు వాటాల పంప‌కాల విష‌యంలో తేడాలు వ‌చ్చినందు వ‌ల్ల‌నే సురేఖ కూతురు ఆరోప‌ణ‌లు చేసింద‌న్నారు. అయినా సిగ్గు లేకుండా వ‌త్తాసు ప‌ల‌క‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

Harish Rao Slams Minister Seethakka

ముందు త‌న‌ను అన‌డం కంటే సీత‌క్క త‌న స‌హ‌చ‌ర కేబినెట్ లో మంత్రి కొండా సురేఖ‌ను అడిగితే తెలుస్తుంద‌న్నారు. రాష్ట్రంలో మంత్రులు వ‌సూళ్ల దందాకు తెర లేపార‌ని , ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని ఆరోపించారు. ముందు దాని మీద సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. గన్ ఎవరు తెచ్చారో, పారిశ్రామిక వేత్తలను తుపాకులు పెట్టి ఎందుకు అక్రమవసూళ్లు చేస్తున్నారో చెప్పాల్సిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల‌పై కూడా ఉంద‌న్నారు. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద సిట్ విచారణ చేప‌ట్టాల‌న్నారు. త‌ప్పు చేయ‌క పోతే మంత్రి సురేఖ ఇంటి వ‌ద్ద‌కు పోలీసులు ఎందుకు వెళ్లారో చెప్పాల‌న్నారు.

Also Read : AP Rains Warning : రానున్న 4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు

Exit mobile version