YouTube Pays Huge Amount to Trump : ట్రంప్ కు యూట్యూబ్ 22 మిలియ‌న్ల చెల్లింపు

అమెరికా అధ్య‌క్షుడితో కుదిరిన కీల‌క ఒప్పందం

Hello Telugu - YouTube Pays Huge Amount to Trump

Hello Telugu - YouTube Pays Huge Amount to Trump

YouTube : అమెరికా : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ కు చెందిన యూట్యూబ్ (YouTube) అమెరికా దేశ అధ్య‌క్షుడు ట్రంప్ తో కీల‌క ఒప్పందం చేసుకుంది. ఈమేర‌కు ఇద్ద‌రి మధ్య కుదిరిన ఒప్పందం మేర‌కు ఏకంగా 22 మిలియ‌న్లు చెల్లించేందుకు ఓకే చెప్పింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది స‌ద‌రు సంస్థ‌. గ‌త జ‌న‌వ‌రి 6, 2021న అమెరికా దేశ రాజ‌ధాని వాషింగ్ట‌న్ డీసీపై జ‌రిగ‌గిన దాడికి సంబంధించి ట్రంప్ ఖాతాను స‌స్పెండ్ చేసింది. దీనిపై త‌ను కోర్టుకు వెళ్లారు ట్రంప్. ఆ త‌ర్వాత బైడెన్ దేశ అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. తాజాగా త‌ను చీఫ్ గా కొలువు తీరాక ప‌వ‌ర్ చేతిలోకి వ‌చ్చింది. దీంతో టెక్ దిగ్గ‌జ సంస్థ‌ల‌పై మ‌నోడు క‌న్నేశాడు. అంతే కాకుండా త‌న స్నేహితుడు ఎలాన్ మ‌స్క్ తో తెలివిగా ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేసేలా చేశాడు. దానిని పూర్తిగా మార్చేశాడు మ‌స్క్. ట్విట్ట‌ర్ ను ఎక్స్ గా మార్చేశాడు.

YouTube Pays Huge Amount to Trump

జనవరి 6 తర్వాత బిగ్ టెక్ ద్వారా ట్రంప్ తన విస్తృత డీప్లాట్‌ఫార్మింగ్‌ను సవాలు చేస్తూ చట్టపరమైన కేసులు దాఖలు చేసిన తర్వాత, గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్‌కు అనుబంధ సంస్థ అయిన ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రంప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన సెటిల్‌మెంట్ నోటీసు ప్రకారం లాభాపేక్షలేని సంస్థ ద్వారా $22 మిలియన్లు వైట్ హౌస్‌లో ట్రంప్ తాజా నిర్మాణ ప్రాజెక్టుకు వెళతాయ‌ని పేర్కొంది. ట్రంప్ బాల్‌రూమ్ వెంచర్‌కు 22 మిలియన్లతో పాటు, అమెరికన్ కన్జర్వేటివ్ యూనియన్‌తో సహా ఇతర ట్రంప్ మిత్రుల హోస్ట్‌కు $2.5 మిలియన్ల చెల్లింపులకు కూడా యూట్యూబ్ అంగీకరించింది.

Also Read : Popular Cricketer Tilak Varma : తిల‌క్ వ‌ర్మ‌కు గ్రాండ్ వెల్ క‌మ్

Exit mobile version