Tilak Varma : హైదరాబాద్ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma). తను ఒక్కడే 69 రన్స్ చేశాడు. సంజూ శాంసన్ తో కలిసి 54 రన్స్ , శివమ్ దూబేతో కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆట చివరి దాకా తను నాటౌట్ గా నిలిచాడు. ఎక్కడా తొట్రు పాటుకు గురి కాకుండా జట్టును విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా తిలక్ వర్మకు పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. దుబాయ్ లో ఆసియా కప్ ను కైవసం చేసుకున్న అనంతరం సూర్య కుమార్ సారథ్యంలోని భారత జట్టు సభ్యులు తమ తమ స్వంత ప్రదేశాలకు విచ్చేశారు.
Tilak Varma Viral
తాజాగా క్రికెటర్ తిలక్ వర్మ నేరుగా దుబాయ్ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విచ్చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ సంస్థ (శాప్) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. శాప్ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తిలక్ వర్మకు 22 ఏళ్లు. 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో తిలక్ వర్మ 53 బంతులు ఎదుర్కొని 69 పరుగులు చేశాడు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఆడాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్. టీమ్ ఇండియా తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకోవడం.
Also Read : Telangana Police Strong Focus : సినిమా పైరసీ రాకెట్ పై ఖాకీల ఉక్కుపాదం
