హైదరాబాద్‌లో స్ప్లాష్‌బిఐ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్

ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

hellotelugu-SridhaarBaabu

హైద‌రాబాద్ : అమెరికాకు చెందిన మ‌రో ఐటీ కంపెనీ హైద‌రాబాద్ న‌గ‌రంపై ఫోక‌స్ పెట్టింది. ఈమేర‌కు సోమవారం తీపి క‌బురు చెప్పింది . హైదరాబాద్‌లో స్ప్లాష్‌బిఐ కంపెనీ కొత్తగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి)ని ఏర్పాటు చేసింది. దీనిని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు ప్రారంభించారు. అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన స్ప్లాష్‌బిఐ వారి ఈ కొత్త కేంద్రం ప్ర‌ధానంగా ప్రొడక్ట్ ఇంజనీరింగ్, ఏఐ డెవలప్‌మెంట్ , డేటా అనలిటిక్స్‌పై దృష్టి సారిస్తుంది. ఈ కేంద్రం 275 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. రాబోయే 5 నుండి 7 సంవత్సరాలలో ఈ సంస్థ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని కూడా యోచిస్తోంద‌ని వెల్ల‌డించారు ఈ సంద‌ర్బంగా మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు.

తెలంగాణకు మరిన్ని జిసిసిలను తీసుకు రావడానికి ఆవిష్కరణ, సాంకేతికత, ఉత్పత్తి అభివృద్ధి ద్వారా ప్రపంచ స్థాయి విలువను సృష్టించే కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దడానికి త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్ర‌క‌టించారు. త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించిన పెట్టుబ‌డిదారుల‌ను కూడా ఆహ్వానిస్తున్నామ‌ని చెప్పారు. ఇదే క్ర‌మంలో త‌మ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను డిసెంబ‌ర్ నెల‌లో నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఈ కీల‌క స‌ద‌స్సుకు హాజ‌రు కావాల‌ని కోరారు స‌ద‌రు కంపెనీ య‌జ‌మానుల‌ను. ఇదిలా ఉండ‌గా న‌గ‌రంలో కొత్త‌గా జీసీసీ ని ఏర్పాటు చేసినందుకు స్ప్లాష్ బిఐ బృందానికి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ విప్ , మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు.

Exit mobile version