ముంబై : ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ సంచలనంగా మారారు. తన ప్రవర్తన రోజు రోజుకు ఇబ్బందిగా మారిందంటూ ఫిమేల్ సింగర్స్ వాపోతున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిరంజీవి నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో తను పాడిన మీసాలపిల్ల సాంగ్ టాప్ లో కొనసాగింది. దీనిని ఉదిత్ నారాయణ్ , మధు ప్రియతో కలిసి పాడారు. కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్న ఉదిత్ నారాయణ్ టాప్ సింగర్స్ లలో ఒకటిగా కొనసాగారు. ఇటీవలి కాలంలో ఈ మధ్య కాలంలో ఆయన వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.
ఈ మధ్య ఒక ఈవెంట్ లో యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. ఉదిత్ నారాయణ్ నవ్వుల పాలయ్యారు. ఆపై ట్రోలింగ్ కు గురయ్యారు. చివరకు సారీ చెప్పారు. గాయకుడిగా ఉదిత్ ను ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా ఆయన వింత ప్రవర్తనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎక్కడైనా కనిపిస్తే దగ్గరికి వెళ్లాలంటే యువతులు, మహిళలు, ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇక సుదీర్ఘకాలం ఆయనతో ప్రయాణం.చేస్తున సతీమణి రంజన కూడా ఆయన చేష్టలతో విసిగి పోయారు. ఆయన ప్రవర్తన భరించలేకుండా ఉండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బీహార్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో భర్త పై ఫిర్యాదు చేశారు.
