హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. అనుభవజ్ఞురాలైన నేపథ్య గాయని కె. జమున రాణి ఇవాళ కన్నుమూశారు. ఆమె గళం అందించిన కొన్ని ప్రముఖ చిత్రాలలో ద్రోహి, రత్నమాల, లైలా మజ్ను, చంద్రరాణి, దేవదాసు, అలీబాబా 40 దొంగలు , అన్నదమ్ముడు వంటివి ఉన్నాయి. ఆమె అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. 1938 మే 17న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు జమున రాణి. ఏడేళ్ల వయసులో తెలుగు క్లాసిక్ చిత్రం ‘త్యాగయ్య’ (1946)తో తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , సింహళ భాషలలో 6,000కు పైగా పాటలను పాడారు. తనదైన స్వరంతో ప్రేక్షకులను రంజింప చేశారు.
తద్వారా దక్షిణ భారతదేశంలోని అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలురైన నేపథ్య గాయనిలలో ఒకరిగా విస్తృత గుర్తింపు పొందారు. 13 ఏళ్ల వయసులోనే ఆమె అగ్రశ్రేణి నటీమణుల కోసం పాటలు పాడటం ప్రారంభించారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అనేక చిరస్మరణీయమైన పాటలను అందించారు. తన సింహళ పాటలతో శ్రీలంక చలనచిత్ర పరిశ్రమకు కూడా ఆమె గణనీయమైన సేవలు అందించారు. ఆమె గళం అందించిన కొన్ని ప్రముఖ చిత్రాలలో ద్రోహి, రత్నమాల, లైలా మజ్ను, చంద్రరాణి, దేవదాసు, అలీబాబా 40 దొంగలు, అన్నదమ్ముడు వంటివి ఉన్నాయి. ఆమె గాంభీర్యమైన, భావయుక్తమైన స్వరం, భారతీయ చలనచిత్ర పరిశ్రమ స్వర్ణయుగంలో అత్యంత ఆదరణ పొందిన నేపథ్య గాయనిలలో ఒకరిగా ఆమెను నిలిపింది. కె. జమునారాణి మృతి పట్ల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. మొన్నటికి మొన్న గాన కోకిల ఎస్. జానకి మృతి చెందగా ఇవాళ జమునా రాణిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
