ఆగ‌స్టు 8న యష్ టాక్సిక్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్

క‌న్ ఫ‌ర్మ్ చేసిన చిత్ర బృందం , ద‌ర్శ‌కురాలు

hellotelugu-ToxicTrailer

బెంగ‌ళూరు : ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలిగా గుర్తింపు పొందిన మ‌ల‌యాళ ప‌రిశ్ర‌కు చెందిన గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వహించిన తాజా చిత్రం టాక్సిక్. ఇందులో స్టార్ హీరో య‌ష్ తో పాటు ప‌లువురు అంద‌మైన భామ‌లు కీ రోల్ పోషించారు. తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది ఈ చిత్రం గురించి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన గ్లింప్స్ కు, పాట‌ల‌కు ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ ల‌భించింది. ఇప్ప‌టికే య‌ష్ కు భారీ క్రేజ్ వుంది. భారీ ఖ‌ర్చుతో నిర్మించారు టాక్సిక్ ను . పూర్తిగా హాలీవుడ్ రేంజ్ లో దీనిని తీశారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం ఇప్పటికే ప్రారంభించింది.

అప్పుడప్పుడు పాటలు లేదా పోస్టర్లను విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8, 2026న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రానికి యష్ , గీతూ మోహన్‌దాస్ కథను అందించగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడ , ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.. అలాగే హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఇతర భాషల్లోకి దీనిని అనువదించి విడుదల చేయనున్నారు. యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ , హుమా ఖురేషి వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

Exit mobile version