హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై, ప్రధానంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ పటేల్ సుపుత్రుడు బండి సాయి భగీరథ్ పోక్స్ కేసు లో జరిగిన తాత్సారం గురించి నిలదీశారు. నిగ్గదీసి ప్రశ్నించారు. మైనర్ బాలిక ను, తల్లిదండ్రులను రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం చేసిన, బెదిరింపులకు పాల్పడిన బండి సంజయ్ కుమార్ పటేల్ ను, ఆయనకు మద్దతుగా నిలిచిన మాజీ జర్నలిస్ట్ సంగప్పపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బహిరంగంగా ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి మద్దతు ఎలా పలుకుతారంటూ మండిపడ్డారు. మీరు సోయి ఉండే మాట్లాడుతున్నారా అని పేర్కొన్నారు ఆర్ఎస్పీ. గురువారం తెలంగాణ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
తక్షణమే బండి సంజయ్ కుమార్ పటేల్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని, లేకపోతే కేసు నీరుగారి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్, సంగప్పల వ్యవహారం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని అడిగారు. అధికారిక ప్రకటనలపై ఏమేం సెక్షన్ల ప్రకారం చట్టబద్ధంగా కేసులు నమోదు చేయవలసి ఉంటుందో స్పష్టంగా వివరించారు మాజీ పోలీసు అధికారి.. ప్రస్తుత రాజకీయ నాయకుడు .ఈనెల 10 న మోదీ హైదరాబాద్ పర్యటనలో బండి సంజయ్ ను కాపాడమని మీకు చెప్పారా.. లేదా..? అని నిలదీశారు. ఏ దేవుడి దగ్గర అయినా అమ్మవారి దగ్గర అయినా సరే.. మేము సిద్ధం రావడానికి.. తడి బట్టలతో ప్రమాణం చేసి చెప్పగలరా..? అని సవాల్ విసిరారు. సీఎం..బండి..శ్రీరామ్..సంగప్ప ఫోన్ కాల్స్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
