ముంబై : దేశమంతటా ఇప్పుడు దురంధర్ -2 మూవీ గురించి చర్చ జరుగుతోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా గతంలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతోంది. దురంధర్ -1 ఇప్పటికే రిలీజ్ అయి రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇదే సమయంలో ఆ మూవీ సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా దర్శకుడు ఆదిత్య ధర్ దురంధర్ -2ను తీశాడు. అది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ఓ రేంజ్ లో తీశాడు దర్శకుడు ఆదిత్య ధర్.
తను ఇప్పుడు సంచలనంగా మారాడు. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఎవరీ మూవీ దర్శకుడు అంటూ తెగ వెతికేస్తున్నారు ఫ్యాన్స్. ఆదిత్య ధర్ భారతీయ సినీ దర్శకుడు. రచయిత, గీత రచయిత. తను బాలీవుడ్ లో సూపర్ దర్శకుడిగా పేరు పొందాడు. తన దర్శకత్వంలో వచ్చిన Uri The Surgical Strike (2019) సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారంగా తీశాడు. ఈ మూవీతో ఆయనకు National Film Awards లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. ఇదిలా ఉండగా ఆదిత్య ధర్ ప్రముఖ నటి యామి గౌతమ్ ను పెళ్లి చేసుకున్నాడు.
