ఎవ‌రీ నీరు ధండా ఏమిటా క‌థ‌..?

కష్టాల నుండి స్వర్ణం వరకు ప్ర‌స్థానం

hellotelugu-NeeruDhanda

హైద‌రాబాద్ : జ‌పాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో స‌త్తా చాటింది. ఏకంగా స్వ‌ర్ణం సాధించింది భార‌త దేశానికి చెందిన నీరు ధండా. ఈ అరుదైన ఘ‌న‌త సాధించేందుకు ఆమె ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీమ్ ఈవెంట్‌లో 125 పాయింట్లకు 118 స్కోర్ చేసి నీరు భారతదేశం తరపున అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో నీరు ధండా చారిత్రాత్మక స్వర్ణం సాధించిన అనంతరం ఆ షూటర్ తండ్రి సురేష్ తన కుమార్తె విజయాన్ని ప్రశంసించారు. ఆమె కుటుంబం తుపాకీ కొనివ్వలేని పరిస్థితిని ఎదుర్కొంది. మొదట్లో వేరొకరి తుపాకీతో తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుంటూ ఈ క్రీడలోకి ఎలా అడుగు పెట్టిందో కూడా ఆయన వివరించారు. ట్రాప్ షూటింగ్‌లో వ్యక్తిగత ఆసియా క్రీడల స్వర్ణం గెలిచిన దేశపు తొలి మహిళగా నీరు ధండా నిలవడంతో, ఆమె సాధించిన ఈ చారిత్రాత్మక పతక విజయం భారత షూటింగ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆమె తన తొలి గేమ్స్ క్వాలిఫికేషన్‌లోనే ఆసియా రికార్డును కూడా నెలకొల్పింది .

30 షాట్‌లకు గాను కేవలం రెండు మాత్రమే మిస్ అయి 28 స్కోరుతో ముగించింది. ఈ విజయం గురించి నీరూ తండ్రి సురేష్ ఇలా అన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. గ్రామంలో ఆనందం వెల్లి విరిసింది. కేవలం నాకే కాదు, మొత్తం గ్రామానికి కూడా ఈ విజ‌యం మ‌రింత ఆనందాన్ని క‌లిగించేలా చేసింద‌న్నాడు. . నేను ఒక రైతును. కుటుంబం ఆనందంతో ఉప్పొంగి పోతోంది. ఆమె షూటింగ్‌లోకి ఎలా వచ్చిందనే దానిపై స్పందించాడు. ఆమె మేనత్త కొడుకైన రెజ్లర్ సోమ్‌వీర్ మద్దతుతోనే ఆమె ఈ క్రీడలోకి వచ్చిందని, ఆమె సాధన చేయడానికి ఉపయోగించిన తుపాకీ కూడా తనది కాదని గుర్తు చేసుకున్నారు. ఆమె రెజ్లర్ సోమ్‌వీర్ ద్వారా క్రీడల్లోకి వచ్చింది. మా దగ్గర తుపాకీ కూడా లేదు. ఆమె వేరొకరిది ఉపయోగించింది. ఆమె ఇంత దూరం వస్తుందని మాకు అస్సలు తెలియదు. ఆమెకు మద్దతు ఇచ్చి, పంపిన రెజ్లర్ సోమ్‌వీర్ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నాడు.

Exit mobile version