భార‌త జ‌ట్టును న‌డిపించే స‌త్తా గిల్ కు ఉంది

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విరాట్ కోహ్లీ

hellotelugu-ViratKohli

తిరువ‌నంత‌పురం : స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు శుభ్ మ‌న్ గిల్ గురించి. భవిష్యత్తులో భారత్ జట్టును నడిపించే సరైన దృక్పథం త‌న‌కు ఉంద‌న్నాడు. జట్టును నడిపించడానికి అవసరమైన సరైన దృక్పథం , పట్టుదల గిల్‌లో ఉన్నాయని కోహ్లీ గుర్తించారు. ఆదివారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు ముందు ‘జియోస్టార్’ తో మాట్లాడిన కోహ్లీ ప్రస్తుత కెప్టెన్ గురించి తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు, గిల్ బ్యాటింగ్ శైలిలో వచ్చిన మార్పులను కూడా విశ్లేషించారు. కెప్టెన్‌గా శుభ్‌మన్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఈ బాధ్యతలో అతను ఇంకా కొత్తవాడే అయినప్పటికీ, భారత జట్టును నడిపించడానికి అవసరమైన సరైనవ‌న్నీ ఉన్నాయ‌ని పేర్కొన్నాడు. వ్యూహరచన చేసేటప్పుడు గిల్ ప్రదర్శించే స్పష్టత , పనులను సరైన పద్ధతిలో చేయాలనే అతని సంకల్పం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునేలా చేశాయ‌న్నాడు కోహ్లీ .

మైదానంలో జట్టు పనితీరుపై అతనికి చాలా స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. అనుభవం పెరిగేకొద్దీ , పరిస్థితులను అర్థం చేసుకునే కొద్దీ, నిర్ణయాలు తీసుకునే విధానంలో అతను మరింత మెరుగు పడతాడన‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. నాయకత్వ బాధ్యతలో ఉన్న ఎవరైనా ఇలాగే చేస్తారు అని కోహ్లీ ప్రశంసించారు. అయితే భారత క్రికెట్ జట్టును సరైన మార్గంలో నడిపించాలనే బలమైన కోరిక అతనిలో ఉంది. అదే అత్యంత ముఖ్యమైన విషయం. కాబట్టి, అతను దీర్ఘకాలం పాటు జట్టును నడిపిస్తాడని, అద్భుతంగా రాణిస్తాడని నేను భావిస్తున్నాను అని కోహ్లీ జోడించారు. ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందుండే సామర్థ్యం గిల్‌కు ఉందని అభిప్రాయపడ్డారు.

ఫీల్డింగ్‌లో బ్యాటర్లను అవుట్ చేయడానికి అతను కొత్త మార్గాల గురించి ఆలోచిస్తాడు; ఇది ఎప్పుడూ ఏదైనా భిన్నంగా చేయడానికి లేదా ప్రత్యర్థి కంటే ఒక అడుగు ముందుండటానికి సంకేతం. విభిన్న ఫీల్డ్ సెట్టింగ్‌లను ఉపయోగించడానికి, ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేయడానికి, బౌలర్లతో స్పష్టంగా సంభాషించడానికి , నిర్దిష్టమైన బౌలింగ్ వ్యూహాన్ని అమలు చేయడానికి అతను ఏమాత్రం వెనుకాడడు అని కోహ్లీ అన్నాడు.

Exit mobile version