ఆసియా క్రీడ‌ల్లో తొలి స్వ‌ర్ణం సాధించిన ‘నీరు దండా’

భార‌తీయ షూటర్ గా చ‌రిత్ర సృష్టించింది

helloteluguNeeruDanda

జ‌పాన్ : ఆసియా క్రీడల్లో మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ షూటర్‌గా నిలిచి నీరు ధండా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆమె గత ఆసియా రికార్డును కూడా అధిగమించారు. అంతకు ముందు త‌ను మహిళల ట్రాప్ టీమ్ (జట్టు) విభాగంలో భారత్‌కు రజత పతకం దక్కేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల నీరు గత జూలైలో ఇటలీలో జరిగిన షాట్‌గన్ ప్రపంచ కప్‌లో ట్రాప్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఇప్పుడు ఇక్కడ 28 పాయింట్ల స్కోరుతో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు; ఇది గత ఆసియా రికార్డు (24 పాయింట్లు) కంటే మెరుగైనది కావ‌డం విశేషం.. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు ఏ భారతీయ మహిళా ట్రాప్ లేదా స్కీట్ షూటర్ కూడా వ్యక్తిగత పతకాన్ని గెలుచుకోలేదు. పురుషుల వ్యక్తిగత ట్రాప్ విభాగంలో 1978 క్రీడల్లో రణధీర్ సింగ్ భారత్‌కు చారిత్రాత్మక వ్యక్తిగత స్వర్ణాన్ని అందించగా, 2010 క్రీడల్లో పురుషుల డబుల్ ట్రాప్ విభాగంలో రోంజన్ సోధి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.

క్వాలిఫికేషన్ రౌండ్‌లో 118 పాయింట్లతో ఖతార్‌కు చెందిన రే బాసిల్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన నీరు దండా ఫైనల్‌కు అర్హత సాధించారు; ఈ 118 పాయింట్ల స్కోరు ఒక క్వాలిఫికేషన్ రికార్డు కూడా. నీరు (118), ఆషిమా అహ్లావత్ (106) , మనీషా కీర్ (104)లతో కూడిన త్రయం మహిళల విభాగంలో మొత్తం 328 పాయింట్లు సాధించారు. స్వర్ణ పతకం గెలుచుకున్న భార‌త షూట‌ర్ త‌ర్వాత చైనా (346 పాయింట్లు) షూట‌ర్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. చైనా జట్టులో లియు షాన్షాన్, సన్ యునాంగ్, జు జింగ్యు ఉన్నారు. కువైట్‌కు చెందిన అల్హవల్ షహద్, అబ్దుల్మాలిక్ హజర్ , అల్హవల్ సారా త్రయం మొత్తం 325 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

Exit mobile version