విశాఖను ఎక్స్ పోర్ట్ హబ్ గా మారుస్తాం : లోకేష్

ఫార్మా యూనిట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయండి

hellotelugu-LokeshNaraa

మాస్కో (రష్యా): విశాఖపట్నాన్ని రష్యా మార్కెట్లకు ఎక్స్‌పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్దడమే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నామ‌ని, ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ డీప్-వాటర్ పోర్టుల ద్వారా ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తున్నట్లు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్ప‌ష్టం చేశారు. CIS రీజియన్, రష్యా మార్కెట్లలో బలమైన ఎక్స్‌పోర్ట్ నెట్‌వర్క్ ఉన్న ఆర్ఎంఎం ఫార్మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ తో మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. .విశాఖపట్నాన్ని వ్యూహాత్మ‌క‌ లాజిస్టిక్స్ గేట్ వేగా అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాం అన్నారు. ఇందులో భాగంగా పెద్దఎత్తున పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. విశాఖలో నిర్మాణంలో ఉన్న ఆర్ఎంఎం ఫార్మా యూనిట్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల‌ని కోరారు.

ఆర్ఎంఎం ఫార్మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ. విశాఖలో రూ.200 కోట్ల వ్యయంతో తమ సంస్థ చేపట్టిన యూనిట్ నిర్మాణం పురోగతిలో ఉందని చెప్పారు. దీనిద్వారా 300 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. విశాఖ యూనిట్ లో ఇంజెక్టబుల్స్, టాబ్లెట్లు, క్యాప్సూల్స్ తయారు చేస్తామని వెల్ల‌డించారు. 2027 మార్చి నాటికి పూర్తి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం అవుతుందని లోకేష్‌కు వివ‌రించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు ఐటీ విద్యా శాఖ మంత్రి. అందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు ప్ర‌భుత్వ ప‌రంగా అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Exit mobile version