సీఎం విజ‌య్ క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌పై రామ్ దాస్ ఫైర్

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రం

hellotelugu-AmbumaniRamdas

చెన్నై : మేకెదాటు ఆనకట్ట ప్రాజెక్టుపై చర్చల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కర్ణాటకకు వెళ్లే అవకాశం ఉందన్న వార్తలను పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ విమర్శించారు. అటువంటి పర్యటన రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత హానికరం అని ఆయన హెచ్చరించారు. ఢిల్లీకి బయలుదేరే ముందు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. ఒకవేళ గాంధీ ఆనకట్టకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్డీఏ నుండి బయటకు రావడానికి పీఎంకే సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు. మేము మేకెదాటు ఆనకట్ట ప్రాజెక్టును అంగీకరించ లేదన్న విష‌జ్ఞం గుర్తు పెట్టుకోవాల‌న్నారు. ఎప్పుడూ అంగీకరించని ప్రాజెక్టుపై చర్చలు జరపడంలో అర్థం లేదన్నారు. ఒక ర‌కంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా వెళ్ల‌డ‌మే అవుతుంద‌న్నారు. క‌ర్ణాట‌క‌తో చ‌ర్చ‌లు జ‌రిపే కంటే కేంద్రంతో ములాఖ‌త్ అవుతే బావుంటుంద‌ని సూచించారు రామ్ దాస్.

డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స‌ ను ఉపసంహరించుకునేలా , మేకెదాటు ఆనకట్ట నిర్మాణం జరగకుండా చూసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. కావేరీ నీటి నియంత్రణ కమిటీ ఆదేశాలు ఉన్నప్పటికీ, కర్ణాటక కావేరీ నీటిని విడుదల చేయడానికి నిరంతరం నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కర్ణాటక జలాశయాల్లో 62 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి నియంత్రణ కమిటీ రెండుసార్లు ఆదేశించినప్పటికీ, విడుదల చేయడానికి నీరు లేదని చెబుతూ ఆ రాష్ట్రం నిరాకరించిందని ఆరోపించారు రామ్ దాస్. అటువంటి ఆదేశాల తర్వాత కూడా నీటిని విడుదల చేయడానికి నిరాకరించే ప్రభుత్వంతో చర్చలు జరపడంలో అర్థం ఏమిటి అని ప్ర‌శ్నించారు.

Exit mobile version