హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఆఫీసులకు సంబంధించి స్థలాల లీజు విషయంలో కొంత సానుకూల పరిణామం చోటు చేసుకోవడం ఒకింత ఆశ్చర్య పోయేలా చేసింది. 2026 ప్రథమార్థంలో భారతదేశంలో కార్యాలయ స్థలాల లీజింగ్ 7 శాతం పెరిగి 41.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఇక హైదరాబాద్ వృద్ధికి ఊతమివ్వడం ఇందులో చెప్పుకోదగిన విషయం. తాజాగా సావిల్స్ ఇండియా కీలక నివేదిక వెల్లడించింది. డిమాండ్ పరంగా చూస్తే బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం లీజింగ్‌లో దాదాపు సగం వాటా జీసీసీలదే కావడంతో ఖాళీగా ఉన్న స్థలాల శాతం 13.2 శాతానికి తగ్గింది. 2026 ప్రథమార్థంలో భారతదేశంలోని ప్రధాన ఆరు నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్ ఏడాది ప్రాతిపదికన 7 శాతంపెరిగి 41.6 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ప్రపంచవ్యాప్త అనిశ్చితి ఉన్నప్పటికీ స్థిరమైన ఆక్యుపెయర్ (అద్దెదారులు/కంపెనీలు) కార్యకలాపాలు , గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు విస్తరణ చేపట్టడం వల్ల డిమాండ్ బలంగా కొనసాగింది.
ఈ కాలంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్థలం (సప్లై) 23.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5 శాతం తక్కువ. దీని ఫలితంగా, జూన్ 2026 చివరి నాటికి మొత్తం ‘గ్రేడ్ A’ కార్యాలయ స్థలాల నిల్వ 872.7 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఖాళీగా ఉన్న స్థలాల శాతం మెరుగు పడింది, ఇది ఏడాది క్రితం ఉన్న 14.7 శాతం నుండి 13.2 శాతానికి తగ్గింది. నగరాల వారీగా చూస్తే, 13.1 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్‌తో బెంగళూరు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది, ఇది మొత్తం లీజింగ్‌లో 32 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత పూణే 15..4 శాతం వాటాతో నిలవగా, ఢిల్లీ-NCR 15 శాతం వాటాను అందించింది. హైదరాబాద్‌లో 5.9 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది (9% వృద్ధి), అయితే నగరంలో కొత్త సరఫరా గణనీయంగా తగ్గింది. రంగాల వారీగా చూస్తే, టెక్నాలజీ సంస్థలు 35 శాతం వాటాతో కార్యాలయ లీజింగ్ కార్యకలాపాల్లో ముందున్నాయి,
