టీడీపీ గూండాల దాడుల‌పై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేస్తాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన వైసీపీ చీఫ్ వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

hellotelugu-YSJagan

తాడేప‌ల్లిగూడెం : రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పింద‌ని నిప్పులు చెరిగారు మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ మెగా డీఎస్సీ స్కాంపై తాము శాంతియుతంగా ఆందోళ‌న చేప‌డితే టీడీపీ గూండాలు కావాల‌ని దాడుల‌కు దిగార‌ని, ఆపై తాము దాడి చేసిన‌ట్లు ప్ర‌చారం చేశారి ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాడేప‌ల్లిగూడెంలోని ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌గ‌న్ రెడ్డి ముఖ్య నేత‌ల‌తో కీల‌క స‌మావేశం చేప‌ట్టారు. డీఎస్సీపై సీబీఐ విచారణకోరుతూ వైయస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీలపై టీడీపీ గూండాల దాడిపై చర్చ జ‌రిగింది. చంద్రబాబు, లోకేష్‌ల పథకానికి కొంతమంది పోలీసులు కొమ్ము కాశార‌ని పార్టీ నేత‌లు ఆరోపించారు. ఈ దాడి ఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని ప్ర‌క‌టించారు జ‌గ‌న్ రెడ్డి. ఈ వ్యవహారాన్ని గవర్నర్‌కు కలిసి వివరించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. డీఎస్సీ స్కాంలో చంద్రబాబు, లోకేష్‌లు అడ్డంగా దొరికార‌ని పేర్కొన్నారు. సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తుంటే తట్టుకోలేక పోతున్నారని అన్నారు.

స్కాంలను బయట పెడుతుంటే దాడులు చేస్తున్నారని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డి. నిన్న వైయస్సార్‌సీపీ చేసిన ర్యాలీ కార్యక్రమంతో డీఎస్సీ స్కాంపై మరోసారి చర్చ జరిగింద‌న్నారు. దీన్ని డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు, లోకేష్‌లు గూండాలను దింపార‌ని మండిప‌డ్డారు. అది యువగళం టీం కాదు.. రౌడీ దళం అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి, స్కాంలు, అరాచకాలను ప్రశ్నించేచోట ఈ రౌడీదళాన్ని దించుతున్నారని ఆరోపించారు .వారితో దాడులు చేయించి భయపెట్టి, బెరించాలని చూస్తున్నారని అన్నారు. దీనికి పోలీసులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలో రౌడీదళంతో అలజడికి కుట్ర చేశారని మండిప‌డ్డారు. పోలీసుల వద్ద లాఠీలు లాక్కుని, రాళ్లదాడులు చేశారని వాపోయారు. ఈ దాడులకు కుప్పంలోనే చంద్రబాబు కుట్ర పన్నారని భ‌గ్గుమ‌న్నారు. నిన్నటి కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు చేసిన బెదిరింపులే దీనికి సాక్ష్యం అన్నారు జ‌గ‌న్ రెడ్డి .

Exit mobile version