ఈ టెక్నాలజీ ఎకో సిస్టమ్‌ను అభివృద్ది చేస్తాం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APETechnology

అమరావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేలా నాగార్జున యూనివర్శిటీలో NIELIT ఇన్నోవేషన్, స్కిల్లింగ్ సెంటర్ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కమ్యూనికేషన్, సెమీ కండక్టర్ టెక్నాలజీలపై ఈ కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంద‌ని వెల్ల‌డించారు. ఈ విద్యా సంవత్సరంలోనే కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని ప్ర‌క‌టించారు సీఎం. దీని ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీంతో వేలాది మంది విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు లబ్ధి పొందనున్నారని అన్నారు.

జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా NPTEL జాతీయ పరీక్షల్లో 4 బంగారు పతకాలు, 14 రజత పతకాలు సాధించిన మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను అభినందిస్తున్నట్లు తెలిపారు సీఎం. రాష్ట్రంలోని ప్రతిభ, కృషి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ఎకోసిస్టమ్‌కు ఈ విజయాలే నిదర్శనం అన్నారు. క్వాంటమ్ వ్యాలీ విజన్ తో భవిష్యత్‌ను అందిపుచ్చుకునేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న క్రమంలో మరింత మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్ములు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కోర్సులు, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని కోరారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Exit mobile version