శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే తాట తీస్తాం

సీరియ‌స్ కామెంట్స్ చేసిన సీఎం చంద్ర‌బాబు

hellotelugu-CM

అమ‌రావ‌తి : డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామ‌ని, దీనిపై 350 పిటిషన్లను వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. కొన్ని ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. కూటమి ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయదు. భయపడి వెనక్కు వెళ్లదని స్ప‌ష్టం చేశారు. కొందరు చేసిన ఆరోపణలకు తగిన సమాధానం ఇచ్చాం అన్నారు. గత ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో దారుణాలకు పాల్పడిందని ఆరోపించారు. .హైకోర్టు కూడా సిట్ వేసి విచారణ చేయాలని ఆదేశించిందన్నారు. రాజకీయ ముసుగు వేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోం అన్నారు. వారు వదిలి వెళ్లిన 1.53 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ తొలగించడానికి 2 ఏళ్లు పట్టిందన్నారు సీఎం.

వారు సృష్టించిన భూ వివాదాలను ప్రక్షాళన చేయడానికి మూడేళ్లు పడుతోందని మండిప‌డ్డారు. ఉద్యోగులకు, పోలీసులకు డీఏ, సరెండర్ లీవ్ లు కూడా ఇస్తున్నాం. ఎక్కడా పొరపాట్లు లేకుండా ప్రతీ నిర్ణయంలో వేగం ఉండాలి. ప్రతీ నిర్ణయంలో మానవీయ కోణం ఉండాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఆదాయం లేకపోతే సంక్షేమం ఇవ్వలేం. డీప్ టెక్నాలజీతో కూడిన న్యూ గవర్నె్న్సులో లీడర్షిప్ కీలకం అన్నారు . జీఎస్టీలో 18 శాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్డీపీ అంచనాలు కూడా దేశ సగటుతో పోలిస్తే అధికంగా ఉందన్నారు సీఎం. 2027 నాటికి రాష్ట్రంలో భూసమస్యలను అన్నీ పరిష్కరిస్తాం. అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తాం అన్నారు.

Exit mobile version