ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌ర్షం జ‌ర భ‌ద్రం : ఐఎండీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

hellotelugu-HeavyRains

అమ‌రావ‌తి : వాయువ్య- పశ్చిమమధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కి.మీ., దక్షిణ కోస్తా తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడ రాదన్నారు. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీవర్షాలు , విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. నిన్న సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా ఎంఎస్ పల్లిలో 39.7మిమీ, అనకాపల్లి జిల్లా పరవాడలో 17.7మిమీ, కాకినాడ జిల్లా శంఖవరంలో 16.5మిమీ, అల్లూరి జిల్లా రామరాజపాలెంలో 15.5మిమీ, శ్రీకాకుళం ఇచ్చాపురం, కాకినాడ జిల్లా వేలంకలో 15మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. ఇక ఇవాళ రాత్రికి శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Exit mobile version