విశాఖపట్నం : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖలో చోటు చేసుకున్న ఘటనపై స్పందించారు. మంగళవారం ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ ఉన్నారు.
ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు నారా లోకేష్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని ఎన్డీయే, ఉప ముఖ్యమంత్రి తరలి వచ్చారని తెలిపారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఆయా కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటాం అని ప్రకటించారు. అందరం కలిసి పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్ ను కాపాడు కోగలిగామని చెప్పారు ఈ సందర్బంగా మంత్రి లోకేష్. ప్రమాదం జరగిన ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాని స్పష్టం చేశారు.
