Vizag Steel Plant Clarification Interesting : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ జ‌ర‌గ‌దు

స్ప‌ష్టం చేసిన జ‌న‌సేన పార్టీ అధినేత‌లు

Hello Telugu - Vizag Steel Plant Clarification Interesting

Hello Telugu - Vizag Steel Plant Clarification Interesting

Vizag Steel Plant : విశాఖ‌ప‌ట్నం – ఆరు నూరైనా స‌రే బ‌లిదానాల సాక్షిగా ఏర్ప‌డిన విశాఖ ఉక్కు సంస్థ‌ను ప్రైవేటీక‌ర‌ణ చేసే ప్ర‌స‌క్తి లేద‌న్నారు మంత్రి మ‌నోహ‌ర్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ను ప్రైవేటీకరణ చేస్తున్నారనే స‌మాచారం బయటకు రాగానే మొట్టమొదట స్పందించిన వ్యక్తి త‌మ పార్టీ అధినేత‌ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి, కనీసం దీనిపై నోరెత్తక పోయినా కేంద్ర మంత్రి అమిత్ షాతో చ‌ర్చించి నిల‌పుదుల చేయించారని చెప్పారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలువరించేలా, అఖిలపక్షం వేసి ఢిల్లీకి తీసుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ అప్పట్లో సూచించినా వైసీపీ నాయకుడు జ‌గ‌న్ రెడ్డి స్పందించ లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Vizag Steel Plant Clarification

ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ కుటిల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు నాదెండ్ల మ‌నోహ‌ర్. మొదటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బలంగా పోరాటం చేసింది జనసేన పార్టీ మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ఢిల్లీ పెద్దలను కోరారని అన్నారు. ముసుగులో దాక్కుని పాలన సాగించిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర లో మిగిలి పోయారంటూ ఎద్దేవా చేశారు.
గిరిజన బాలిక సుగాలి ప్రీతి కి జరిగిన అన్యాయంపై నిజాయతీగా మొదటి నుంచి పోరాడింది జనసేన పార్టీ మాత్రమేన‌ని పేర్కొన్నారు. కర్నూలు నగరంలో రెండు లక్షల మందితో పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహించి అప్పటి ప్రభుత్వాన్ని తట్టి లేపార‌న్నారు.

Also Read : Nadendla Manohar Interesting Comments : విలువలే జనసేన పార్టీకి ఊపిరి : మ‌నోహ‌ర్

Exit mobile version