Nadendla Manohar Interesting Comments : విలువలే జనసేన పార్టీకి ఊపిరి : మ‌నోహ‌ర్

జన సైనికులు, వీర మహిళలే పార్టీకి ఇంధనం

Hello Telugu - Nadendla Manohar Interesting Comments

Hello Telugu - Nadendla Manohar Interesting Comments

Nadendla Manohar : విశాఖ‌ప‌ట్నం : విలువ‌లే జ‌న‌సేన పార్టీకి ఊపిరి అని స్ప‌ష్టం చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహర్ (Nadendla Manohar). పాలసీ మేకర్స్ గా, లా మేకర్స్ గా ఒకే గొంతు వినిపిస్తూ ముందుకు వెళ్దామ‌న్నారు. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ప్రజలకు ఏది మంచి జరిగితే దానికి కట్టుబడి జనసేన పార్టీ పని చేస్తుందన్నారు. యువత, మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. దీనిపై ఒక బలమైన నిర్ణయం తీసుకునేలా చట్టసభల్లో మా పార్టీ ప్రతినిధులు మాట్లాడతార‌ని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జన సైనికులు, వీర మహిళలు బలంగా నిలబడ్డారని ప్ర‌శంసించారు మ‌నోహ‌ర్. విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Nadendla Manohar Key Comments

అప్పటి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వాటిని అడ్డుకుని నిల‌బ‌డ్డామ‌న్నారు. అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి నాయకులకు ఎదురొడ్డి విశాఖపట్నంలో పోలింగ్ స్టేషన్లలో కూర్చున్న వాళ్లను జన సైనికులు, వీర మహిళలు బయటకు రప్పించార‌ని గుర్తు చేశారు. అలాంటి వారికి పార్టీ కోసం నిలబడిన యువతకు ప్రాధాన్యమిస్తూ వారితో మమేకం కావాలని పవన్ కళ్యాణ్ గారు భావించారని, వారికి ప్ర‌యారిటీ ఇచ్చార‌న్నారు. ఎంతో దూరదృష్టితో రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ చేసిన ఆలోచనలే ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చేలా పని చేశాయని చెప్పారు నాదెండ్ల మనోహ‌ర్. వైసీపీ ఆగ‌డాల‌ను అడ్డుకుని నిల‌బ‌డ్డందుకే జ‌నం మ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చి భారీ విజ‌యాన్ని అందించార‌ని చెప్పారు.

Also Read : DY CM Pawan Kalyan Important Words : సోష‌ల్ మీడియాపై ప్ర‌త్యేక చ‌ట్టం రావాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Exit mobile version