Vitamin B12 Deficiency Shocking : మీకు ఈ అలవాటు ఉందా? అయితే వెంటనే జాగ్రత్త పడండి

ఇది విటమిన్ లోపాల వల్ల కలిగే సమస్య కావచ్చని హెచ్చరిస్తున్నారు...

Hello Telugu - Vitamin B12 Deficiency Shocking

Hello Telugu - Vitamin B12 Deficiency Shocking

Vitamin B12 : ఆహారపు అలవాట్ల మాదిరిగానే నిద్ర కూడా ఆరోగ్యానికి అత్యంత అవసరమైన అంశం. అయితే కొంతమంది ఎక్కువసేపు నిద్రపోవడం సాధారణం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది విటమిన్ లోపాల వల్ల కలిగే సమస్య కావచ్చని హెచ్చరిస్తున్నారు.

Vitamin B12 Deficiency Facts

విటమిన్ బి12 (Vitamin B12), ఐరన్, విటమిన్ డి, మెగ్నీషియం లోపాలు శరీరానికి తగిన శక్తి అందకపోవడానికి, అలసట, అధిక నిద్ర సమస్యలకు దారితీస్తాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్ బి12 (Vitamin B12) ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమై శక్తిని పెంపొందిస్తుంది. దీని లోపం శరీరంలో అలసటను పెంచుతుంది. పాలు, పెరుగు, చేపలు, గుడ్లు, జున్ను వంటి ఆహార పదార్థాలు బి12 లోపాన్ని అధిగమించడానికి సహాయపడతాయి.

ఐరన్ లోపం వల్ల మెదడు, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక అలసట, అధిక నిద్ర సమస్యలు వస్తాయి. పాలకూర, పప్పులు, బీన్స్, మటన్‌ వంటి ఆహారాలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

విటమిన్ డి లోపం కూడా శరీర శక్తిని తగ్గించి నిద్ర మత్తు పెంచుతుంది. ఉదయం సూర్యరశ్మిలో కొంతసేపు గడపడం, అలాగే పాలు, పెరుగు, పుట్టగొడుగులు, చేపలు, గుడ్లు తీసుకోవడం విటమిన్ డి అందించడంలో సహాయపడతాయి.

అదే విధంగా మెగ్నీషియం లోపం నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది. బాదం, పాలకూర, గుమ్మడికాయ గింజలు, అరటిపండ్లు, జీడిపప్పు తీసుకోవడం ద్వారా మెగ్నీషియం అవసరాన్ని తీర్చుకోవచ్చు.

నిపుణుల సూచన ప్రకారం, అధిక నిద్ర సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సరైన ఆహారపు అలవాట్లతో పాటు విటమిన్ లోపాలను సమయానికి అధిగమించడం అవసరం.

Also Read : Chapati Vs Rice Interesting Facts : డిన్నర్ కి చపాతీ మంచిదా, రైస్ మంచిదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవండి

Exit mobile version