VinFast New Innovation : భారత్‌లోకి విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్‌ దూకుడు

ఈ సంస్థకు ఇది ఒక కీలక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు...

Hello Telugu - Vinfast New Innovation

Hello Telugu - Vinfast New Innovation

VinFast : వియత్నాం ఆటోమొబైల్ బ్రాండ్ విన్ఫాస్ట్ భారత మార్కెట్‌లో అధికారికంగా ప్రవేశించింది. కంపెనీ తాజాగా VF 6, VF 7 ప్రీమియం ఎలక్ట్రిక్‌ SUVలు విడుదల చేస్తూ, తూత్తుకుడిలో ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కర్మాగారం దేశీయ అవసరాలతో పాటు ఎగుమతులకూ కేంద్రంగా పనిచేయనుంది. 2017లో స్థాపించబడిన ఈ సంస్థకు ఇది ఒక కీలక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు.

VinFast – వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు

భారత మార్కెట్లో తన స్థానాన్ని బలపరచుకోవడానికి విన్ఫాస్ట్ (VinFast) ఆకర్షణీయమైన ఓనర్‌షిప్ ప్యాకేజీలను ప్రకటించింది.

మార్కెట్ లక్ష్యం

భారతీయ వినియోగదారులు ఇంకా పెట్రోల్, డీజిల్ వాహనాల నుండి ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మారడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, విన్ఫాస్ట్ అందిస్తున్న ఈ సౌకర్యాలు నమ్మకాన్ని పెంచుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో పోటీ వేడెక్కుతున్న వేళ, విన్ఫాస్ట్ తొలి అడుగుతోనే బలమైన ప్రభావాన్ని చూపించబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : Stock Market Shocking : గత 3 రోజులుగా లాభాల్లో నడిచిన మార్కెట్..నేడు కాస్త వెనక్కి

Exit mobile version