Stock Market : దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం (సెప్టెంబర్ 11) ప్రారంభంలో మిశ్రమ ధోరణి ప్రదర్శించాయి. గత మూడు రోజులుగా వరుసగా లాభాలను నమోదు చేసిన సూచీలు ఈరోజు కాస్త నెమ్మదించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన, శుక్రవారం వెలువడబోయే దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల (Stock Market) నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలు కూడా సూచీలపై ప్రభావం చూపుతున్నాయి.
Stock Market – మార్కెట్ పరిస్థితి
- సెన్సెక్స్: బుధవారం ముగింపు 81,425 పాయింట్లతో పోలిస్తే, గురువారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత తిరిగి లాభాల్లోకి చేరి ఒక దశలో 160 పాయింట్లు పెరిగింది. ఉదయం 10:10 గంటలకు స్వల్పంగా 6 పాయింట్ల లాభంతో 81,431 వద్ద కొనసాగుతోంది.
- నిఫ్టీ: సెన్సెక్స్ బాటలోనే సాగుతూ, ప్రస్తుతానికి 2 పాయింట్ల లాభంతో 24,975 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు
- సెన్సెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, పీఎన్బీ, ఎన్‌హెచ్‌పీసీ షేర్లు పెరుగుదల నమోదు చేశాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు
- సోనా బీఎల్డబ్ల్యూ, ఇన్ఫో ఎడ్జ్, ఎంఫసిస్, గ్లెన్‌మార్క్, టాటా ఎలాక్సీ షేర్లు నష్టపోతున్నాయి.
ఇతర సూచీలు
- నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్: 10 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.
- బ్యాంక్ నిఫ్టీ: 8 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది.
రూపాయి-డాలర్ మారకం విలువ
- రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే ₹88.17 వద్ద కొనసాగుతోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వచ్చే రెండు రోజుల్లో వెలువడబోయే కీలక ఆర్థిక గణాంకాలపై మార్కెట్ దిశ ఆధారపడి ఉండవచ్చని సూచిస్తున్నారు.
Also Read : Larry Ellison Shocking to Musk : మస్క్ ను వెనక్కి నెట్టిన ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు
