చెన్నై : తమిళ సినీ చరిత్రలో అత్యంత జనాదరణ పొందిన నటుడు దళపతి విజయ్. తన సినీ కెరీర్ లో చివరి చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోట్లాది రూపాయల ఖర్చుతో దీనిని తీర్చిదిద్దే పనిలో పడింది దర్శకుడు హెచ్ వినోత్. ఇప్పటికే సాంగ్స్ కూడా జనాదరణ పొందాయి. కోట్లాది మంది అభిమానులను ప్రపంచ వ్యాప్తంగా కలిగిన నటుడి మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వెంకట్ కె నారాయణ, జగదీష్ పళని సామ, లోహిత్ ఎన్ .కే భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు విజయ్ తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్ . సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ గా మారనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పంపిణీ చేస్తున్న జన నాయగన్ వరల్డ్ వైడ్ గా జనవరి 9వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ముందస్తుగా టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది.
ఈ సినిమా కోసం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. జన నాయగన్ అంటే ప్రజా నాయకుడు అని అర్థం. తమిళ భాషా రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇంకో పాత్రలో నటించింది మమితా బైజు. ఆమెతో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్ , ప్రియమణి ఇతర పాత్రలు పోషించడం విశేషం. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే కానుంది. ఇక దళపతి విజయ్ సినీ కెరీర్ లో జన నాయగన్ 69వ చిత్రం. తాత్కాలికంగా ‘దళపతి 69’ అనే పేరుతో సెప్టెంబర్ 2024లో అధికారికంగా ప్రకటించారు. పొంగల్ పండుగ సందర్బంగా జన నాయగన్ రానుంది.
