Hero Vijay Sethupathi-Casting Couch : క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన విజ‌య్ సేతుప‌తి

త‌ను కొన్ని నిమిషాల పాటు ప్ర‌చారం పొంద‌నీయండి

Hello Telugu - Hero Vijay Sethupathi-Casting Couch

Hello Telugu - Hero Vijay Sethupathi-Casting Couch

Vijay Sethupathi : త‌మిళ సినీ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడిగా గుర్తింపు పొందారు విజ‌య్ సేతుప‌తి. ఆయ‌న జాతీయ స్థాయిలో భిన్న‌మైన పాత్ర‌ల‌కు పేరు పొందారు. ఇదే స‌మ‌యంలో త‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది లండ‌న్ లో ఉంటున్న డాక్ట‌ర్ . త‌ను అంద‌రూ అనుకుంటున్న‌ట్లు మంచి వాడు కాద‌ని, స్త్రీ లోలుడ‌ని ఆరోపించింది. అంతే కాదు త‌న బాధితులు చాలా మంది సినీ రంగంలో, బ‌య‌ట కూడా ఉన్నార‌ని పేర్కొంది. త‌న కార‌ణంగా ఓ మీడియాలో ప‌ని చేస్తున్న మ‌హిళ ఇప్పుడు పిచ్చాసుప‌త్రిలో ఉందంటూ మండిప‌డింది. దీంతో స‌ద‌రు డాక్ట‌ర్ సంచ‌ల‌నంగా మారారు దేశ వ్యాప్తంగా. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై, త‌న‌పై చేసిన కామెంట్స్ పై తాజాగా స్పందించారు విజ‌య్ సేతుప‌తి.

Vijay Sethupathi Key Comments on Casting Couch

కాగా త‌ను సినీ కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ఏ ఒక్క న‌టి త‌న గురించి చెడుగా మాట్లాడ‌లేదు. అంతే కాదు ఓ సినిమాకు సంబంధించి త‌న కూతురు లాంటి హీరోయిన్ తోను తాను న‌టించ‌నంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. దీంతో దేశ వ్యాప్తంగా సెన్సేష‌న్ గా మారాడు. ఆయ‌న ఎక్క‌డ ఎప్పుడు మాట్లాడినా విలువల గురించి ప్ర‌స్తావిస్తూ వ‌చ్చాడు. డౌన్ టు ఎర్త్ అనేది త‌న అభిమ‌త‌మ‌న్నాడు. ఈ స‌మ‌యంలో తాను బిగ్ విమెనైజ‌ర్ అంటూ డాక్ట‌ర్ చేసిన కామెంట్స్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi). స‌ద‌రు మ‌హిళ‌ల మాట‌ల‌ను తాను ప‌ట్టించుకోన‌ని పేర్కొన్నాడు. దీని ద్వారా త‌న‌కు మ‌రింత కీర్తి వ‌స్తుంద‌ని, దీంతో త‌ను పాపుల‌ర్ కానివ్వండి అంటూ ఎద్దేవా చేశాడు న‌టుడు.

Also Read : Popular Actress Urvashi : జాతీయ అవార్డుపై ఊర్వ‌శి షాకింగ్ కామెంట్స్

Exit mobile version