హైద‌రాబాద్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ రష్మిక‌ రిసెప్ష‌న్

ఫిబ్ర‌వ‌రి 26న రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో పెళ్లి

hellotelugu-VijayDevarakonda

హైద‌రాబాద్ : పుకార్లకు తెర దించుతూ అధికారికంగా ఒక్క‌టి కాబోతున్నారు ప్ర‌ముఖ న‌టీ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా. విజ‌య్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. త‌ను అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేస్తున్నాడు. త‌న‌ను ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ పెళ్లి చూపులు మూవీతో ప‌రిచ‌యం చేశాడు. ఆ త‌ర్వాత వంగా సందీప్ రెడ్డి చేతిలో ప‌డ్డాడు. త‌ను తీసిన అర్జున్ రెడ్డి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. యూత్ లో యమ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్నాతో క‌లిసి ప‌రుశురామ్ తీసిన గీత గోవిందం సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ స‌మ‌యంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మంద‌న్నాలు ప్రేమ‌లో ప‌డి పోయిన‌ట్లు టాక్. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రూ డేటింగ్ లో ఉండ‌డం, ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

ఇక ర‌ష్మిక మంద‌న్నా ఇవాళ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ గా పేరు పొందింది. త‌ను టాలీవుడ్, బాలీవుడ్ లో ప‌లు సినిమాల‌లో న‌టించింది. ప్ర‌త్యేకించి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప మూవీ 1, 2 దుమ్ము రేపాయి. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతూ రికార్డుల మోత మోగించాయి. ఆ త‌ర్వాత చావాలో న‌టించింది. అది బిగ్ హిట్ గా నిలిచింది. అయితే స‌ల్మాన్ ఖాన్ తో చేసిన సికింద‌ర్ ఎత్తి పోయింది. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం రౌడీ జ‌నార్ద‌న్ మూవీలో న‌టిస్తున్నాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఈనెల 26న ఒక్క‌టి కాబోతున్నారు. రాజ‌స్తాన్ లో ని ఉద‌య్ పూర్ వేదిక‌గా పెళ్లి చేసుకోనున్నారు. ఇక రిసెప్ష‌న్ వేడుక హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు టాలీవుడ్ లో టాక్.

Exit mobile version