కేరళలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై విజిలెన్స్ విచారణ

స్వాగ‌తించిన అధికార పార్టీతో పాటు ప్ర‌తిపక్ష పార్టీలు

hellotelugu-CECJnaneshKuumar

తిరువ‌నంత‌పురం : కేరళలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై విజిలెన్స్ విచారణను స్వాగతించాయి యుడీఎఫ్ , ఎల్డీఎఫ్ పార్టీల నేత‌లు. 2006లో త‌న విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా జ్ఞానేష్ కుమార్ పీడ‌బ్ల్యూడీ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలో ఒక ఇంజ‌నీర్ ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేయ‌డంతో త‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న మ‌ర‌ణానికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని కేర‌ళ‌లోని కాంగ్రెస్ కూట‌మి స‌ర్కార్ ఆదేశించింది. దీనిని ప్ర‌తి ఒక్క‌రు స్వాగ‌తించారు. ఈ నిర్ణ‌యాన్ని అప్పటి పీడ‌బ్ల్యూడీ మంత్రి ఎంకే మునీర్ స్వాగతించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారిగా ఉన్నారు జ్ఞానేష్ కుమార్. స‌ర్ పేరుతో భార‌త దేశంలో 13 కోట్ల మందికి పైగా ఓట్ల‌ను తొల‌గించారు. ఇది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. బీజేపీకి అనుకూలంగా , ఆ పార్టీ అధికారంలో వ‌చ్చేందుకు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

కేర‌ళ పీడ‌బ్ల్యూడీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో చేపట్టిన కేఎస్టీపీ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆరోపణలు , ఒక మలేషియా ఇంజనీర్ మరణంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు కేర‌ళ హోం శాఖ మంత్రి ర‌మేష్ చెన్నితాల‌. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని కోరారు మాజీ మంత్రి మునీర్. ఇదే స‌మ‌యంలో సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎంవీ గోవింద‌న్ కూడా ఈ విచార‌ణ‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేరళలో జ్ఞానేష్ కుమార్ పై ఉన్న అన్ని కేసులను పరిశీలించాలని అన్నారు. కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన కుమార్ కేంద్రానికి వెళ్లే ముందు రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేశారు. 2006లో అంగమాలి నుండి తిరువనంతపురం వరకు ఎంసీ రోడ్డు పునర్నిర్మాణం కోసం కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచ బ్యాంక్ నిధులతో రూ. 215 కోట్ల విలువైన ప్రాజెక్టును చేపట్టారు.

Exit mobile version