హైదరాబాద్ , అమరావతి : బంగాళా ఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీనివల్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇదే సమయంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రైతులు , మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని , అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడా వర్షాలు , ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు ఐఎండీ ఎండీ ప్రఖర్ జైన్ . ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, కాకినాడ, కోనసీమ , పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మెరుపులు ,బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ. గాలి వేగం గంటకు 30–40 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని తెలిపింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు ఎండీ . మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు . ఇప్పటికే సముద్రంలో ఉన్నవారిని వెంటనే తిరిగి రావాలని కోరారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు, మెరుపులు , ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. . మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు.
