Popular Actor Asrani Death : ప్రముఖ నటుడు అస్రానీ కన్నుమూత

బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం

Hello Telugu - Popular Actor Asrani Death

Hello Telugu - Popular Actor Asrani Death

Asrani : ముంబై : హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం అలుముకుంది. ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందిన అస్రానీ అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో గొప్ప న‌టుడిని బాలీవుడ్ కోల్పోయింది. త‌ను రాసిన హమ్ అంగ్రేజోన్ కే జమానే కే జైలర్ హై అనే డైలాగ్ అస్రానీకి (Asrani) కల్ట్ హోదాను తెచ్చిపెట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన చిత్రం షోలే. ఈ సినిమాలో అస్రానీ జైల‌ర్ పాత్ర పోషించాడు. త‌ను ప్రేక్ష‌కుల హృద‌యాల‌లో చెర‌గ‌ని ముద్ర వేశాడు. ఆ త‌ర్వాత త‌ను వెను దిరిగి చూడ‌లేదు. ఎన్నో వైవిధ్య భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను పోషించాడు. ప్రేక్ష‌కుల అభిమానాన్ని సంపాదించాడు. త‌ను ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు న‌టుడి మేనేజ‌ర్ వెల్ల‌డించాడు. ఇక అస్రానీ వ‌య‌సు 84 ఏళ్లు.

Popular Actor Asrani No More

ఐదు దశాబ్దాలుగా అనేక చిత్రాలలో నటించాడు అస్రానీ. ఆయ‌న అస‌లు పేరు గోవర్ధన్ అస్రానీ. త‌ను న‌టించిన చిత్రాల‌లో పాపుల‌ర్ పొందాయి షోలే , న‌మ‌క్ హ‌రామ్ , గుడ్డి. ఈ సినిమాల‌లో త‌ను పోషించిన పాత్ర‌ల‌కు అత్యంత పేరు తెచ్చేలా చేసింది. శివారు జుహులోని భారతీయ ఆరోగ్య నిధి ఆసుపత్రిలో చేరిన నాలుగు రోజుల తర్వాత ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విల‌క్ష‌ణ న‌టుడు అస్రానీ ఐదు దశాబ్దాల కెరీర్‌లో 300 కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఎక్కువగా క్యారెక్టర్ పాత్రలు పోషించారు . తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌కు విస్తృత ప్రశంసలు పొందారు. షోలేలోని హాస్య పాత్ర ది గ్రేట్ డిక్టేటర్లోని చార్లీ చాప్లిన్‌ను పోలి ఉంది. ఆయన ప్రసిద్ధ చిత్రాలలో బావ‌ర్చి, గోల్ మాల్ , హేరా ఫేరి, చుప్ చుప్ కే, హ‌ల్చుల్, దీవానే హుయే పాగ‌ల్, వెల్ క‌మ్ ఉన్నాయి. శాంతా క్రూజ్ లో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.

Also Read : Hydraa Victims – KTR Strong Support : హైడ్రా బాధితుల‌కు కేటీఆర్ భ‌రోసా

Exit mobile version