జాన్వీ క‌పూర్ కామెంట్స్ పై స్పందించిన రెజీనా కాసాండ్రా

పెద్ది మూవీపై ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన విల‌క్ష‌ణ న‌టీమణి

hellotelugu-ReginaKasandra

ముంబై : బుచ్చిబాబు సన ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన పెద్ది మూవీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్. ఆ స‌న్నివేశాలు చేసి ఉండాల్సింది కాద‌ని పేర్కొంది. తాజాగా క‌ర‌ణ్ జోహార్ నిర్వ‌హిస్తున్న కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసింది. సినిమా ఆశించిన మేర ఆడ‌లేదు. మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీలో కీ రోల్ పోషించినా వ‌ర్క‌వుట్ కాలేదు. భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇదే క్ర‌మంలో పెద్దిలో జాన్వీ క‌పూర్ ను అత్యంత దారుణంగా చిత్రీక‌రించార‌ని, బోల్డ్ సినిమా కంటే దారుణంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న‌ను ఏకి పారేశారు. గ‌త్యంత‌రం లేక ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ ను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.

పెద్ది ఫెయిల్ అయినా ఇప్ప‌టికీ ఆ సినిమా గురించిన చ‌ర్చ‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. మ‌రో వైపు తెలుగు చిత్రసీమలో పనిచేసిన తన అనుభవాన్ని రాధికా ఆప్టే పంచుకున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై జరుగుతున్న చర్చపై నటి రెజీనా కాసాండ్రా తన అభిప్రాయాలను వెల్లడించడం క‌ల‌క‌లం రేపింది. నటీమణులు తమ అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడటాన్ని రెజీనా స్వాగతించినప్పటికీ, ఈ అంశంపై చర్చ జరుగుతున్న తీరును ఆమె ప్రశ్నించారు. అలాగే ఉత్తర-దక్షిణ విభజన సృష్టించ వద్దని హెచ్చరించారు.

అక్షయ్ కుమార్ నటించిన ధర్మా ప్రొడక్షన్స్ వారి ‘కేసరి చాప్టర్ 2’ చిత్రంతో తన అనుభవాన్ని కూడా ఆ నటి గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో తాను అక్షయ్ కుమార్ భార్యగా నటించినప్పటికీ, ప్రచార కార్యక్రమాల సమయంలో తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని రెజీనా ఆరోపించారు. ఏదైనా ఒక సన్నివేశం లేదా తమ పాత్రల చిత్రీకరణ పట్ల అసౌకర్యంగా అనిపించినప్పుడు మాట్లాడే స్వేచ్ఛ నటీనటులకు ఉండాలని అన్నారు. తమపై మోపిన డిమాండ్లతో ఏకీభవించనంత మాత్రాన, ఏ నటుడూ ఒక ప్రాజెక్ట్‌లో పని కొనసాగించమని ఒత్తిడికి గురి కాకూడదని ఆమె నొక్కి చెప్పారు.

Exit mobile version