మ‌ణిర‌త్నం సినిమాలో నాని, ధ‌నుష్, సూర్య‌..?

త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జోరుగా ప్ర‌చారం

helloteugu-Maaniratnam

చెన్నై : భార‌తీయ సినీ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం త్వ‌ర‌లో ఓ మూవీ తీయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న కోల్ క‌తా వేదిక‌గా ఓ ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక ఇదే చిత్ర ద‌ర్శ‌కుడికి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ప్ర‌త్యేకించి తెలుగు, త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొత్త టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే మణిరత్నం త‌ను తీయ‌బోయే తదుపరి చిత్రంలో టాలీవుడ్ హీరో నానితో పాటు త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోలుగా ఉన్న ధ‌నుష్, సూర్య‌ల‌తో క‌లిసి ఆ సినిమా ఉండ‌బోతోందంటూ టాక్. ఈ చిత్రంలో కథానాయికగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్రనటుడు నాని తన తాజా చిత్రం ది పారడైజ్ సాధించిన విజయంతో మంచి ఉత్సాహంలో ఉన్నారు. ఎటువంటి విరామం లేకుండానే ఆయన తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు.

ప్రేక్షకులను అలరించేందుకు నాని వరుస చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఆయన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాని ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఒక తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా మరో ప్రధాన పాత్రలో కనిపించే అవకాశం ఉంది. అంతే కాకుండా మరో అగ్రనటుడు సూర్య కూడా ఇందులో కీలక పాత్ర పోషించవచ్చని కొన్ని వార్తలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఇది దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే అతిపెద్ద మల్టీ-స్టారర్ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో కథానాయికగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మణిరత్నం, సాయి పల్లవి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఇంజి వెల్లం’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

Exit mobile version