Hydraa Victims – KTR Strong Support : హైడ్రా బాధితుల‌కు కేటీఆర్ భ‌రోసా

కాంగ్రెస్ స‌ర్కార్ బాధితుల‌కు బిగ్ షాక్

Hello Telugu - Hydraa Victims - KTR Strong Support

Hello Telugu - Hydraa Victims - KTR Strong Support

KTR : హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు. హైడ్రా పేరుతో పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా హైద‌రాబాద్ లోని సున్నం చెరువులో బాధిత కుటుంబాలతో కలిసి దీపావళి వేడుక జ‌రుపుకున్నారు. శేరిలింగంపల్లిలోని సున్నం చెరువు వద్ద హైడ్రా బాధితుల కుటుంబాలతో గ‌డిపారు. నిరాశ్రయులైన పేదలకు ధైర్యం చెప్పే ఉద్దేశంతో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

KTR Support Hydraa Victims

గత జూన్ 30వ తేదీన శేరిలింగంపల్లి సున్నం చెరువు వద్ద నిరుపేదల ఇళ్లను ‘హైడ్రా’ సహాయంతో కూల్చి వేయడంతో అంద‌రూ నిరాశ్ర‌యులుగా మారార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్. ఎన్నో సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న పేదల ఇళ్లు తెల్ల వారేసరికి నేలమట్టం అయ్యాయని దీంతో వారంతా రోడ్డు పాల‌య్యారంటూ పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా వారితో ముచ్చ‌టించారు. ఇళ్లు కూల్చివేసిన తర్వాత బాధిత నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు ఇస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని బాధితులు గోడు వెళ్ల‌బోసుకున్నారు.

Also Read : Jeevan Reddy Fired on MLA Sanjay : ఎమ్మెల్యే సంజ‌య్ పై జీవ‌న్ రెడ్డి ఫైర్

Exit mobile version