Minister Vasamshetty Subhash Alarming : అన్న‌దాత సుఖీభ‌వ రైత‌న్న‌ల‌కు భ‌రోసా

మంత్రి వాసం శెట్టి సుభాష్ కామెంట్స్

Hello Telugu - Minister Vasamshetty Subhash Alarming

Hello Telugu - Minister Vasamshetty Subhash Alarming

Vasamshetty Subhash : అమ‌రావ‌తి – అన్న‌దాత‌ల అభ్యున్న‌తి కోసం త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు మంత్రి వాసం శెట్టి సుభాష్ (Vasamshetty Subhash). దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉండాలని ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకు వ‌చ్చామ‌ని అన్నారు. .రైతుల 10 వేళ్ళు మట్టిలోకి వెళితేనే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయన్నారు. రైతే రాజు అనే నినాదానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని చెప్పారు. రైతులకు భరోసా కల్పించే పథకానికి నిదర్శనం అన్నదాత సుఖీభవ ప‌థ‌కం అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలు, ప్ర‌ధాన మంత్రి కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు వెరసి సంవత్సరానికి 20 వేలు చొప్పున ఆర్థిక సహాయం రైతులుకు అందచేస్తున్నామ‌ని అన్నారు మంత్రి వాసం శెట్టి సుభాష్.

Minister Vasamshetty Subhash Key Comments

తొలి విడతగా రూ. 7 వేలు చొప్పున రాష్ట్రంలో 46 లక్షల 85, వేల 838 రైతుల ఖాతాల్లో రూ. 3,174 కోట్లు కేంద్ర, రాష్ట్ర నిధులు జమ చేయడం జరిగింద‌ని వెల్ల‌డించారు. ఇది రైతుల పక్షాన కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని స్ప‌ష్టం చేశారు. 90 శాతం సబ్సిడీతో బిందు సేద్యం, సబ్సిడీపై ఎరువులు, డ్రోన్ లు ఇచ్చామ‌న్నారు. విత్తనాల కోసం పొలం పిలుస్తుందని అనే కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సూచనలు అందజేసేలా చేశామ‌న్నారు. వ్యవసాయం సులభతరంగా ఉండేందుకు డ్రోన్లు సహాయంతో మందులు పిచికారి చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు వాసంశెట్టి సుభాష్ (Vasamshetty Subhash). వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 26 వేల మంది రైతులకు 61 కోట్ల రాయితీ ఇచ్చామ‌ని ప్ర‌క‌టించారు. కిసాన్ డ్రోన్ ల కోసం 875 రైతు గ్రూపులకు 70 కోట్ల రాయితీలు ఇచ్చిన‌ట్లు తెలిపారు.

నల్లబర్లీ పొగాకు రైతులకు చేయూతనిస్తూ 8 మిలియన్ కిలోలు కొనుగోలు చేసి 273 కోట్ల చెల్లించామ‌ని చెప్పారు మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamshetty Subhash). మామిడి, కోకో రైతులకు 184 కోట్లు లబ్ధి చేకూర్చామ‌న్నారు. ఖరీఫ్ సీజన్లో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 6 లక్షల మంది రైతుల దగ్గర కొనుగోలు చేసి రూ.8282 కోట్లు 24 గంటల లోపు చెల్లించ‌డం జ‌రిగింద‌న్నారు. రబీ సీజన్లో 2 లక్షల మంది రైతుల దగ్గర 19.84 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.4,575 కోట్లు చెల్లించామ‌న్నారు మంత్రి సుభాష్. 56 వేల మంది పాడి రైతులకు 50 శాతం రాయితీపై 5 వేల మెట్రిక్ టన్నుల పోషకాహార మేత అందించామ‌ని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలు ఇచ్చామ‌ని, వేటలేని కాలంలో ఇబ్బందులు పడుతున్న 1.30 లక్షల మంది మత్స్యకారులకు, వారికి ఇచ్చే భృతిని 20 వేలకు పెంచి రూ.258 కోట్లు చెల్లించామ‌ని చెప్పారు.

Also Read : Chinta Mohan Shocking Comments : ఓట్ల చోరీ నిజం రాహుల్ చెప్పింది వాస్త‌వం

Exit mobile version