Chinta Mohan Shocking Comments : ఓట్ల చోరీ నిజం రాహుల్ చెప్పింది వాస్త‌వం

కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చెయ్యాలి

Hello Telugu - Chinta Mohan Shocking Comments

Hello Telugu - Chinta Mohan Shocking Comments

Chinta Mohan : తిరుప‌తి – ఓట్ల చోరీ జ‌రిగింది నిజ‌మేన‌ని, ఈ విష‌యంపై రాహుల్ గాంధీ చెప్పింది ముమ్మాటికీ వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ (Chinta Mohan). భారత ఎన్నికల కమిషన్ అప్రజాస్వామ్యంగా, అనైతికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గురువారం చింతా మోహ‌న్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం భారత దేశ ఎన్నికల ప్రక్రియను సజావుగా, సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం చెందిందని ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎలక్షన్ కమిటీలో సభ్యుడుగా ఉండే వార‌ని, కానీ ఇప్పుడు ఆ సీన్ లేకుండా పోయింద‌న్నారు. దీంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌న్నారు.

Ex Union Minister Chinta Mohan Key Comments

ఇప్పుడు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ సెలక్షన్ కమిటీలో లేక పోవడం పెద్ద పొరపాటు అని పేర్కొన్నారు చింతా మోహ‌న్ (Chinta Mohan). స్క్రీనింగ్ కమిటీలో నలుగురు పేర్లను నామమాత్రంగా ప్రతిపాదించి, అందులో తమకు ఇష్టమైన ఒకరిని ఎంపిక చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అమెరికా వంటి పెద్ద దేశంలో ఒకరే, నవంబర్ 5వ తేదీ, ఒకే రోజు దేశమంతా ఎన్నికలు జరుపుతున్నారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి, తమకు అనుకూలమైన తేదీల్లో ఎన్నికలు జరుపుతున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 6 -7 దశల్లో పోలింగ్ నిర్వహించడం, పోలింగ్ తేదీకి, కౌంటింగ్ మధ్య నెల రోజుల పాటు వ్యత్యాసం ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంద‌న్నారు.

అమెరికా, బాంగ్లాదేశ్, మరికొన్ని విదేశాల్లో ఒకే రోజున పోలింగ్ జరుగుతోందని చెప్పారు. మనదేశంలో ఒకే రోజున ఎన్నికలు ఎందుకు నిర్వహించలేక పోతున్నారంటూ ప్ర‌శ్నించారు. ఫామ్ 6, 7లో బతికి ఉన్న వారిని కూడా మరణించినట్లు ఓటర్ లిస్టులో నుంచి పేర్లను తీసేస్తున్నార‌ని ఇలా చేయడం దారుణ‌మ‌న్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ వాస్తవం అన్నారు. ప్రధాని, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై ముగ్గురు నేతృత్వంలో సెలక్షన్ జరగాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ పై చేసిన విమర్శలు అర్థరహితం అన్నారు.

Also Read : Popular Director Trivikram Srinivas : మూర్త‌న్న లాగా బ‌త‌క‌డం చేత కాదు

Exit mobile version