V Srinivas Goud : హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోందని, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (V Srinivas Goud). కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్ట బయలైందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో రిజర్వేషన్ దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని ఆరోపించారు. కానీ బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారని అన్నారు . బీసీల రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణమన్నారు.
V Srinivas Goud Slams Congress Govt
చెల్లని జీవోలను, ఆర్డినెన్సలను విడుదల చేసి నిట్ట నిలువునా మోసం చేశారని మండిపడ్డారు వి. శ్రీనివాస్ గౌడ్. సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడని అన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం అన్నారు. బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ పాల్గొంటున్నాయని ఇదంతా డ్రామా తప్పా మరోటి కాదన్నారు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ తగ్గవద్దని అన్నారు గంగుల కమలాకర్.
Also Read : Massive Fire in Garib Rath Sensational : గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు
