US Tarrifs : అమెరికా భారత్‌పై విధించిన 50 శాతం అదనపు సుంకాలు బుధవారం ఉదయం 9.30 గంటల నుండి అమల్లోకి రానున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యతతో పాటు, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని కారణంగా చూపిస్తూ, ట్రంప్ పరిపాలన మొదట భారత్‌పై 25 శాతం సుంకాన్ని విధించింది. అనంతరం మరో 25 శాతం సుంకం విధించడంతో మొత్తం సుంకాల భారము 50 శాతంకి చేరింది.
US Tarrifs on India
ఈ చర్యను భారత్ “అన్యాయం, అసమంజసం”గా అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల రక్షణకై కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొనకుండా కాపాడుతామని హామీ ఇచ్చింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “భారత్‌పై ఒత్తిడి పెరగవచ్చు, కానీ దేశ ప్రయోజనాల కోసం ఈ సవాళ్లన్నింటినీ మా ప్రభుత్వం భరిస్తుంది” అని తెలిపారు.
Also Read : Sensex Crash Shocking : ట్రంప్ టారిఫ్ తో అల్లకల్లోలంగా మారిన మార్కెట్
