Sensex : భారతీయ వస్తువులపై అమెరికా విధించనున్న 25 శాతం అదనపు సుంకాలు ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయి. ఈ సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మదుపరులు ఆందోళన చెంది భారీగా అమ్మకాలకు దిగారు. ఫలితంగా దేశీయ సూచీలు గణనీయమైన నష్టాలను చవిచూశాయి.
Sensex Crash Shocking
మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 849.37 పాయింట్లు క్షీణించి 80,786.54 వద్ద ముగిసింది. ఒక దశలో సూచీ 949.93 పాయింట్లు కూలి 80,685.98 స్థాయిని తాకింది. సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో 25 నష్టాల్లోనే రోజును ముగించాయి.
బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.5.41 లక్షల కోట్ల మేర తగ్గి రూ.449 లక్షల కోట్లకు పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ 255.70 పాయింట్లు నష్టపోయి 24,712.05 వద్ద క్లోజ్ అయింది.
ఫారెక్స్ మార్కెట్లో కూడా రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంది. డాలర్‌తో పోలిస్తే 13 పైసలు క్షీణించి 87.69 వద్ద ట్రేడింగ్ ముగిసింది.
వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవు
బుధవారం వినాయక చవితి సందర్భంగా బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ, కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. గురువారం నుండి ట్రేడింగ్ సాధారణంగా కొనసాగనుంది.
Also Read : Today Gold Price : పండగవేళ పరుగులు తీస్తున్న పసిడి ధరలు
