భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చల్లో స‌వాళ్లు లేవు

స్ప‌ష్టం చేసిన భార‌త‌ వాణిజ్య కార్య‌ద‌ర్శి

hellotelugu-IndiaUSA

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో ఎటువంటి అడ్డంకులు లేవని, సరైన సమయం రాగానే ఇరుపక్షాలు సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం తెలిపారు. జూన్ 2026 నాటి వాణిజ్య గణాంకాలపై విలేకరులకు వివరాలు అందిస్తూ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చల్లో మాకు ఎటువంటి సవాళ్లు కనిపించడం లేదు అని ఆయన పేర్కొన్నారు. చర్చలు ఒక అంగీకరించిన విధానం ప్రకారం ముందుకు సాగుతున్నాయని, ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇటీవలి సమావేశాల గురించి వివరించారు. భార‌త‌ బృందం మే నెలలో అమెరికాను సందర్శించింది. అమెరికా బృందం జూన్‌లో ఇక్కడ పర్యటించింది. సరైన విధానంలో చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు.

విస్తృత వాణిజ్య వాతావరణం గురించి ప్రస్తావిస్తూ ఐఐపీఏ సుంకం తొలగి పోయిందని పేర్కొన్న అగర్వాల్,ఇప్పుడు వారు ఇతర దేశాలతో కూడా చర్చిస్తున్నారు. సమాంతరంగా మరో విచారణ కూడా జరుపుతున్నారు అని తెలిపారు. ఈ ప్రక్రియలో భారత్ కూడా భాగస్వామిగా ఉందని ఆయన చెప్పారు. మేము సంప్రదింపులలో చేరాము. అంతా సరైన దిశలో సాగుతోంది. రెండు ప్రభుత్వాలు బహిరంగంగా సానుకూల ధోరణిని వ్యక్తం చేశాయి. పరిస్థితి బాగుందని ఇరుపక్షాలు చెబుతున్నాయి అని వాణిజ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఒప్పందం స్థితిగతులే ఇందులో కీలకమని అన్నారు. కాగా భారత్-అమెరికా మధ్య ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా సిద్ధంగా ఉందని ప్ర‌క‌టించారు.

Exit mobile version