Upendra Dwivedi Fired on Pakistan : పాకిస్తాన్‌ను భూగోళంలో లేకుండా చేస్తాం : ఆర్మీ చీఫ్

దాయాది దేశానికి ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్

Hello Telugu - Upendra Dwivedi Fired on Pakistan

Hello Telugu - Upendra Dwivedi Fired on Pakistan

Upendra Dwivedi : న్యూఢిల్లీ : భార‌త దేశానికి చెందిన త్రివిధ ద‌ళాల అధిప‌తి (ఆర్మీ చీఫ్ ) జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి దేశ రాజ‌ధానిలో ప్ర‌సంగించారు. ఆప‌రేష‌న్ సింధూర్ అనేది కేవ‌లం ఒక ప్ర‌యోగం మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ముందుంది ముస‌ళ్ల పండుగ అని పేర్కొన్నారు. త్వరలో ఆపరేషన్‌ సిందూర్‌ 2.0ను చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు. దాయాది దేశానికి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. త‌గ‌దున‌మ్మా అంటూ ఉగ్ర‌వాదాన్ని, టెర్ర‌రిస్టుల‌ను ప్రోత్స‌హిస్తే ఈ భూగోళంలో అడ్ర‌స్ లేకుండా చేస్తామ‌ని హెచ్చ‌రించారు ఆర్మీ చీఫ్. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందు కోసం ఇండియాలోని అన్ని సైనిక విభాగాలు సంసిద్ద‌మై ఉండాల‌ని పిలుపునిచ్చారు.

Upendra Dwivedi Slams Pakistan

ఆపరేషన్‌ సిందూర్‌ 1.0లో ఉన్నట్లు ఈ సారి సంయమనం పాటించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi). పాకిస్తాన్‌పై మరింత తీవ్రమైన చర్యలు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు . భూమిపై ఉండాలని అనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఆపాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు ఆర్మీ చీఫ్‌. లేద‌ని ఇలాగే చేస్తామ‌ని అనుకుంటే పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు. ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా యుద్దం ఎలా చేయాలో యావ‌త్ ప్ర‌పంచానికి తెలిసి వ‌చ్చింద‌న్నారు. అన్ని దేశాలు త‌మ ఆప‌రేష‌న్ ను చూసి నివ్వెర పోయాయ‌ని అన్నారు. తోక జాడిస్తే పాకిస్తాన్ తాట తీస్తామ‌న్నారు ఆర్మీ చీఫ్. ఇప్ప‌టికే పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించామ‌న్నారు. కాళ్ల బేరానికి వ‌చ్చినందు వ‌ల్ల‌నే తాము యుద్దాన్ని ఆపాల్సి వ‌చ్చింద‌న్నారు.

Also Read : Prashant Kishor Fired on CM Revanth Reddy : వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తా : పీకే

Exit mobile version