Prashant Kishor Fired on CM Revanth Reddy : వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తా : పీకే

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్

Hello Telugu - Prashant Kishor Fired on CM Revanth Reddy

Hello Telugu - Prashant Kishor Fired on CM Revanth Reddy

Prashant Kishor : ఢిల్లీ : ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్, జ‌న్ సుర‌క్ష పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor) నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకున్నారు. త‌మ రాష్ట్రానికి చెందిన బీహారీ వాసుల ప‌ట్ల చుల‌క‌న చేసి మాట్లాడటం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో రేవంత్ రెడ్డి నిజ స్వ‌రూపం ఏమిటో బ‌య‌ట పెట్టాడ‌రు పీకే. ఆయ‌న ప్ర‌ముఖ దేశీయ ఛాన‌ల్ టైమ్స్ నౌ ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ తో జ‌రిగిన చిట్ చాట్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఒక బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి త‌న స్థాయికి దిగ‌జారి మాట్లాడ‌టం ప‌ట్ల మండిప‌డ్డారు ప్ర‌శాంత్ కిషోర్.

Prashant Kishor Slams CM Revanth Reddy

రాబోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో సీఎం రేవంత్ రెడ్డిని అడ్ర‌స్ లేకుండా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. త‌న‌ను ఓడించి తీరుతాన‌ని శ‌ప‌థం చేశాడు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరూ కాపడ లేర‌న్నారు. బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్లీ ఇంకోసారి గెలవడని జోష్యం చెప్పారు పీకే. బీహార్ ప్రజల DNA తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువ అయినప్పుడు, ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను మూడు సార్లు ఎందుకు అడిగాడని ప్ర‌శ్నించారు . ఈ విష‌యం ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌న్నారు. ఇప్ప‌టికే త‌న గ్రాఫ్ ప‌డి పోయింద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఫ్యూచ‌ర్ లేద‌న్నారు. ఎవ‌రు ఎక్కువ ఎవ‌రు త‌క్కువ అనేది త్వ‌ర‌లో తేలి పోతుంద‌న్నారు ప్ర‌శాంత్ కిషోర్.

Also Read : Hero Vijay Deverakonda-Rashmika : విజ‌య్ దేవ‌రకొండ ర‌ష్మిక మంద‌న్నా నిశ్చితార్థం

Exit mobile version