Chinta Mohan Shocking Comments : టీటీడీలో అంట‌రానిత‌నం బాధాక‌రం – చింతా మోహ‌న్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ కేంద్ర మంత్రి

Hello Telugu - Chinta Mohan Shocking Comments

Hello Telugu - Chinta Mohan Shocking Comments

Chinta Mohan : చిత్తూరు జిల్లా – మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ (Chinta Mohan) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. టీటీడీ బోర్డు మీటింగ్ జ‌రిగింద‌ని, అనేక అంశాలు ప‌రిశీలించార‌ని మంచిదేన‌ని అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టిటిడిలో పనిచేసే ఒక సివిల్ సర్వెంట్ అధికారి అన్య మతం గురించి మాట్లాడటం చాలా బాధాకరమ‌ని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అన్నారు. టిటిడిలో అంటరానితనం కనిపిస్తోంద‌న్నారు. ఆలయంలో ఒక్క ఎస్సి అధికారి లేడన్నారు. ఒక్క అంగడి ఎస్సీకి ఇవ్వ లేద‌ని ఆరోపించారు. అన్య మతం గురించి మాట్లాడ్డం కరెక్ట్ కాదన్నారు చింతా మోహ‌న్.

Chinta Mohan Shocking Comments on TTD

బిజెపి పేదరికాన్ని తీసేయలేక, నిరుద్యోగాన్ని తొలగించలేక, వృధా మాటలు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. CMC వేలూరు, చిత్తూరులో 50 శాతం మంది హిందువులు పని చేస్తున్నారని చెప్పారు. 1912లో, ముల్లార్ అనే మహిళ మదనపల్లెలో టిబి శానిటోరియం స్థాపించారు. TB జబ్బుకు మందు లేని కాలంలో, అన్య మతం అనే భేదం లేకుండా అందరికీ వైద్యం అందించారని గుర్తు చేశారు. రాజంపేట లోక్ సభ సభ్యుడు మిధున్ రెడ్డి చిన్నప్పటి నుంచి త‌న‌కు తెలుస‌న్నారు. రాజకీయంగా పైకొచ్చాడు. లోక్ సభ స్వీకర్ స్థానంలో కూర్చుంటే, చూసి సంతోషించాను. మురిసిపోయానని అన్నారు చింతా మోహ‌న్.

అలాంటి వ్యక్తి జైలుకు పోవడం వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానంటూ పేర్కొన్నారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకు పోతుంద‌న్నారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ పూర్తి చేసి, నిందితులెవరో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు . అందరికీ విద్య అందించాలని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో 35 వేల పాఠశాలను ఆనాటి పీఎం రాజీవ్ గాంధీ ప్రారంభించార‌ని అన్నారు . కూటమి ప్రభుత్వంలో కొందరికే విద్య అందుతోంద‌న్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ విద్యార్థులు మూడు లక్షల మంది ప్రాథమిక విద్యకు దూరమయ్యారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : CM Revanth Reddy Shocking Comments : మా స‌ర్కార్ ఫోన్ ట్యాప్ చేస్తోంది – సీఎం

Exit mobile version