CM Revanth Reddy : ఢిల్లీ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రాన్ని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఈ సందర్బంగా ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని అడిగిన ప్రశ్నకు అవునంటూ సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆయన తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
CM Revanth Reddy Key Comments
అవును తమ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తోందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఇది అన్ని ప్రభుత్వాలు చేసేవేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చట్ట వ్యతిరేకం కానే కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్దం కాదు కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదు అనుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ ఉన్నట్లయితే తాము విచారణకు ఆదేశించిన సిట్ తనను పిలిచి ఉండేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై తమ గవర్నమెంట్ కేసు పెట్టలేదని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి. సామగ్రి మిస్సింగ్ మీద మాత్రమే కేసు అయిందని అన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చోటు చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి వచ్చాక సీన్ మారింది. సిట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
Also Read : Minister Nara Lokesh Interesting Comments : డేటా విప్లవం అవకాశాలు అపారం – నారా లోకేష్
