Ukraine : రష్యా, ఉక్రెయిన్ తన తీరు మార్చుకోవడం లేదు. ఉన్నట్టుండి రష్యాపై అటాక్ ను స్టార్ట్ చేసింది. ఊహించని రీతిలో రష్యా లోని అతి పెద్ద చమురు టెర్మినల్ ను డ్రోన్ ఆపరేషన్ లో దాడి చేపట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న ట్యాంకర్లలో ఒకటి 700,000 బ్యారెళ్ల చమురును తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది . రెండు ట్యాంకర్లకు నిప్పు పెట్టింది . దీంతో చమురు టెర్మినల్ లో కార్యకలాపాలను తక్షణమే నిలిపి వేశారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధికారికంగా ప్రకటించింది. రష్యన్ చమురు కంపెనీ బాష్‌నెఫ్ట్ యాజమాన్యంలో ఉంది. 1,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ తర్వాత లోడింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని కంపెనీ వెల్లడించింది.
Ukraine Drone Attack
ఉక్రెయిన్ (Ukraine) చేసిన దాడి గురించి ధ్రువీకరించారు రష్యాలోని బాష్కోర్టోస్తాన్ ప్రాంత అధిపతి రాడి ఖబిరోవ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక డ్రోన్ ప్లాంట్‌ను ఢీకొట్టగా, మరొకటి కూలిపోయిందని అన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, మరెలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఉత్పత్తి స్థలం స్వల్పంగా దెబ్బతిందని పేర్కొన్నారు. దాడి కారణంగా మంటలు చెలరేగాయని, వాటిని ఆర్పి వేస్తున్నామని చెప్పారు. మాస్కో యుద్ధ నిధులను అంతరాయం కలిగించడానికి రష్యన్ శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులకు పాల్పడడం పట్ల రష్యా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో మిత్ర దేశాలను రష్యన్ చమురు కొనుగోలును నిలిపి వేయాలని కోరారు. సంఘర్షణను ముగించడానికి మాస్కోపై ఒత్తిడి తీసుకు రావడం అవసరమని అన్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ, టర్కీ, హంగేరీ, స్లోవేకియా రష్యన్ చమురును దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తున్నాయి.
Also Read : PM Modi Clear Appeal : కొండ, లోయ మధ్య సామరస్య వంతెన నిర్మించాలి
