PM Modi : ఢిల్లీ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మణిపూర్ లో పర్యటించిన సందర్బంగా రాష్ట్ర ప్రజలకు పూర్తి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలు సామరస్య వంతెనను నిర్మించేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం రాష్ట్రం శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు. హింసను విడనాడాలని వివిధ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూనే కొండ, లోయ వర్గాల మధ్య సామరస్యం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. తన ప్రభుత్వం మణిపూర్ ప్రజలతో ఉందని, రాష్ట్రాన్ని శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు నరేంద్ర మోదీ.
PM Modi Key Comments on Manipur Tour
తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి రెండు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు, ఒకటి కుకి ఆధిపత్యం కలిగిన చురాచంద్‌పూర్‌లో, మరొకటి మైటేయి ఆధిపత్యం కలిగిన ఇంఫాల్‌లో. సహాయ శిబిరాల్లో నివసిస్తున్న అంతర్గతంగా నిరాశ్రయులైన కుటుంబాలను కూడా కలిశారు. 2023 మేలో జాతి హింస చెలరేగిన తర్వాత రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటి సారి కావడం విశేషం. దాదాపు ఆయన పర్యటించేందుకు 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. శాంతి కోసం కేంద్రం నిరంతరం చేసిన ప్రయత్నాలు రెండు పక్షాల మధ్య చర్చలకు దోహదపడ్డాయని మోడీ అన్నారు.
మీ కలలను నెరవేర్చు కోవడానికి, మీ పిల్లల భవిష్యత్తును భద్ర పరచడానికి శాంతి మార్గంలో ముందుకు సాగాలని నేను అన్ని సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీతో ఉన్నానని నేను మీకు హామీ ఇస్తున్నాను. భారత ప్రభుత్వం మీతో ఉందని మరోసారి స్పస్టం చేస్తున్నానని మోదీ ప్రకటించారు.
Also Read : IND vs PAK Match Sensational : దాయాదుల పోరులో దాదా ఎవరో
