తమిళనాడు : తమిళనాట ప్రభంజనం సృష్టించారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. తమిళ రాజకీయాల్లోఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలైన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేశారు. ఆ రెండు చోట్ల విజయం సాధించాడు. ఇప్పుడు తన ఇష్ట సఖి త్రిషను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ చేయించే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్.గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది కాబట్టి.. రాజీనామా చేసే స్థానంలో త్రిష ను పోటీ చేయించే యోచనలో విజయ్ ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
త్రిష పుట్టిన రోజు నాడే ఎన్నికల ఫలితాలు రావడంతో బర్త్ డే గిఫ్ట్ గా విజయ్ ఆమెకు శుభవార్త చెప్పనున్నట్లు ప్రచారం సాగుతోంది. సాయంత్రం ఆరు గంటలకు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెబుతున్న త్రిష ఫ్రెండ్స్. అనుకున్నట్లు జరిగితే మరో ఆరు నెలల్లో త్రిష కూడా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు విజయ్ ప్రస్తుతం సీఎం కావడంలో తను కూడా కీలక పాత్ర పోషించారు. ఆమె ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్న తరుణంలో తను తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా తను అభిమానించే నటుడు విజయ్ సీఎం కావడం పక్కా అని తేల్చారు.
