విశాఖప‌ట్నంలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి భారీ డిజిట‌ల్ ప్రాజెక్ట్

hellotelugu-CableLadingStation

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మ‌రో భారీ ప్రాజెక్టు వ‌చ్చింది. డిజిట‌ల్ ప్రాజెక్టు మంజూరైంది. దీనిని
విశాఖలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందులో భాగంగా ఇక్క‌డ‌ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ఈ కేబుల్ విశాఖపట్నాన్ని సింగపూర్ , తూర్పు ఆసియాతో అనుసంధానిస్తుంది. 2029 చివరి నాటికి మైక్రోసాఫ్ట్-లైట్‌స్టార్మ్ డీప్-సీ (సముద్రగర్భ) కేబుల్ నెట్‌వర్క్ ప్రజల వినియోగం కోసం అందుబాటులోకి రానుంది. విశాఖను కేంద్రంగా చేసుకుని ‘అమెరికా-ఇండియా కనెక్ట్’ సముద్రగర్భ కేబుల్‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమాచారం ప్రకారం, విశాఖలోని గూగుల్ కేంద్రం భారీగా విద్యుత్ వినియోగించుకునే ఏఐ మోడళ్లకు బదులుగా ఏఐ ఇన్ఫరెన్సింగ్ , క్లౌడ్ సేవలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. డీప్-సీ ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటులో టెక్ దిగ్గజాలైన గూగుల్ , మైక్రోసాఫ్ట్‌లతో భాగస్వామ్యం ద్వారా దేశంలోనే మూడవ అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది.

గూగుల్ విశాఖలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తన ‘అమెరికా-ఇండియా కనెక్ట్’ కార్యక్రమంలో భాగంగా విశాఖలో అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ భారీ 15 బిలియన్ డాలర్ల విలువైన గిగావాట్-స్థాయి ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించాలని గూగుల్ యోచిస్తోంది. మైక్రోసాఫ్ట్, లైట్‌స్టార్మ్ , సింగ్‌టెల్ భాగస్వామ్యంతో, 3,600 కిలోమీటర్ల మేర I-2SEA డీప్-సీ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేబుల్ విశాఖపట్నాన్ని సింగపూర్ , తూర్పు ఆసియాతో అనుసంధానిస్తుంది. 2029 చివరి నాటికి, మైక్రోసాఫ్ట్-లైట్‌స్టార్మ్ డీప్-సీ కేబుల్ నెట్‌వర్క్ ప్రజల వినియోగం కోసం అందుబాటులోకి వస్తుంది.

అలాగే, మచిలీపట్నం-హైదరాబాద్-ముంబై , చెన్నై-హైదరాబాద్-ముంబై కారిడార్లలో ఇంటర్ కనెక్టింగ్ డిజిటల్ ఫైబర్ నెట్‌వర్క్ అభివృద్ధి చేయబడుతుంది. ఇది విశాఖపట్నానికి అంతర్జాతీయ డిజిటల్ గేట్‌వేగా మారే అవకాశాన్ని కల్పిస్తుంది. విశాఖను కేంద్రంగా చేసుకుని ‘అమెరికా-ఇండియా కనెక్ట్’ సముద్రగర్భ కేబుల్‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యావరణ అనుకూల చర్యలలో భాగంగా విశాఖ కేంద్రంలో గూగుల్ పునరుత్పాదక విద్యుత్ , ఎయిర్-కూలింగ్ సాంకేతికతను ఉపయోగించే అవకాశం ఉంది.

Exit mobile version