TVK Vijay Stampede Sensational : విజ‌య్ ర్యాలీలో విషాదం 39 మంది దుర్మ‌ర‌ణం

తీవ్ర‌మైన తొక్కిస‌లాట ఘ‌ట‌నపై ఆగ్ర‌హం

Hello Telugu - TVK Vijay Stampede Sensational

Hello Telugu - TVK Vijay Stampede Sensational

TVK Vijay : చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ (TVK Vijay) క‌రూర్ లో చేప‌ట్టిన ఎన్నిక‌ల ర్యాలీ విషాదాన్ని నింపింది. భారీ ఎత్తున జ‌నం హాజ‌రు కావ‌డంతో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో త‌న ప్ర‌సంగాన్ని ఆపేశారు విజ‌య్. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. ప‌రిస్థితిపై ఆరా తీశారు ప్ర‌ధాని మోదీ. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలిపారు. తీవ్ర రద్దీ కారణంగా చాలా మంది స్పృహ కోల్పోవ‌డంతో చివరికి తొక్కిసలాటకు దారితీసింది.

TVK Vijay Stampede Updates

కరూర్‌లోని కరూర్-ఈరోడ్ హైవేలోని వేలుసామి పురంలో జరిగిన విజయ్ ర్యాలీకు జ‌నం పోటెత్తారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. చ‌ని పోయిన 39 మందిలో 16 మంది మ‌హిళ‌లు, ఆరుగురు పిల్ల‌లు కూడా ఉన్నారు. అంతే కాకుండా ఈ విషాద ఘ‌ట‌న‌లో మ‌రో 40 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. గాయ‌ప‌డిన వారిని ప‌రామ‌ర్శించారు సీఎం ఎంకే స్టాలిన్. మృతుల కుటుంబాల‌కు తీవ్ర సంతాపం తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు. ఈ సంఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ‌కు ఆదేశించారు. దీనికి మ‌ద్రాస్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరుణ జ‌గ‌దీస‌న్ నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా టీవీకే విజ‌య్ ప్ర‌సంగిస్తుండ‌గా తొక్కిస‌లాట ప్రారంభ‌మైంద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. త‌న‌ను చూసేందుకు గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండ‌డం క‌నిపించింద‌న్నారు. ఆయ‌న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చేరుకోవాల్సి ఉండ‌గా రాత్రి 7 గంట‌ల‌కు చేరుకున్నారు. దీంతో తొక్కిస‌లాట చోటు చేసుకుంద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : Bitcoin Scam : రాజ్ కుంద్రాపై బిట్‌కాయిన్‌ స్కామ్‌లో ఈడీ ఛార్జీషీట్

Exit mobile version